LOADING...
WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్‌.. ఇక సేవలకు డబ్బులు కట్టాల్సిందేనా?
వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్‌.. ఇక సేవలకు డబ్బులు కట్టాల్సిందేనా?

WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్‌.. ఇక సేవలకు డబ్బులు కట్టాల్సిందేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2026
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్మార్ట్‌ ఫోన్‌ అంటే తప్పనిసరిగా ఉండాల్సిన యాప్‌గా వాట్సాప్‌ మారిపోయింది. మెసేజింగ్‌ నుంచి వాయిస్‌, వీడియో కాల్స్‌, గ్రూప్ కాలింగ్‌ వరకు ఎన్నో కీలక ఫీచర్లతో తక్కువ కాలంలోనే ఈ యాప్‌ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో 'పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్' వైపు అడుగులు వేయొచ్చన్న చర్చ ఇప్పుడు యూజర్లలో ఆందోళనకు కారణమవుతోంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ వినియోగానికి డబ్బులు చెల్లించాల్సి రావొచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రకటనల లేని (Ad-Free) సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను కంపెనీ పరీక్షిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Details

యాప్ కోడ్‌లో కొత్త సంకేతాలు

నివేదికల ప్రకారం, వాట్సాప్ తాజా వెర్షన్ 2.26.3.9 యాప్ కోడ్‌ను పరిశీలించినప్పుడు కీలక వివరాలు బయటపడ్డాయి. స్టేటస్ (Status), ఛానెల్స్ (Channels) విభాగాల్లో కనిపించే ప్రకటనలను తొలగించేందుకు ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు సంబంధించిన కొత్త స్ట్రింగ్‌లు గుర్తించినట్లు సమాచారం. దీని ఆధారంగా భవిష్యత్తులో పెయిడ్ ప్లాన్‌ను అమలు చేయాలనే ఆలోచనలో వాట్సాప్ ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు వాట్సాప్ గానీ, మాతృసంస్థ మెటా (Meta) గానీ అధికారిక ప్రకటన చేయలేదు.

Details

ప్రకటనలపై గతంలోనూ ప్రయోగాలు

ఇది మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా వాట్సాప్ స్టేటస్‌, ఛానెల్స్ విభాగాల్లో ప్రకటనలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అయితే, ఈ నిర్ణయానికి యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రకటనల రహిత, సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌కు అలవాటు పడిన వినియోగదారులు వాట్సాప్‌లో అడ్స్ రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Details

పెయిడ్ మోడల్‌పై స్పష్టత లేదు

ప్రస్తుతం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ఎలా ఉండబోతుందన్న విషయంపై పూర్తి స్పష్టత లేదు. ఇది పూర్తిగా ఐచ్ఛికమా? లేక అన్ని యూజర్లకూ వర్తిస్తుందా? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు. అయితే, కంపెనీ ఈ దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తే, రాబోయే రోజుల్లో అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement

Details

వాట్సాప్ ప్రయాణం

వాట్సాప్‌ను 2009లో జాన్ కౌమ్, బ్రియాన్ ఆక్టన్ స్థాపించారు. 2010లో తక్షణ సందేశ సేవలు ప్రారంభించిన ఈ యాప్‌, 2011లో గ్రూప్ చాట్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఆండ్రాయిడ్‌, iOS ప్లాట్‌ఫార్మ్‌లపై వేగంగా ప్రజాదరణ పొందిన వాట్సాప్‌ను 2014లో ఫేస్‌బుక్‌ (ప్రస్తుతం మెటా) 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతున్న మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ కొనసాగుతోంది.

Advertisement