Siri: ఐఫోన్ కెమెరాలోకి 'సిరి మోడ్'.. గూగుల్ లెన్స్‌కు పోటీగా ఆపిల్ భారీ ప్లాన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్(Apple)తన ఐఫోన్ వినియోగదారులకు కొత్త అనుభవం అందించేందుకు సిద్ధమవుతోంది. రాబోయే iOS 27 అప్‌డేట్‌లో కెమెరా యాప్‌లో ప్రత్యేకంగా "సిరి మోడ్"ను తీసుకురానున్నట్లు బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. ఇప్పటివరకు ఉన్న ఫోటో, వీడియో, పోర్ట్రెయిట్, పానోరమా మోడ్‌లతో పాటు ఈ కొత్త మోడ్ అందుబాటులోకి రానుంది. సిరి మోడ్ ఆన్ చేసినప్పుడు కెమెరాలో షట్టర్ బటన్‌పై ఆపిల్ ఇంటెలిజెన్స్ లోగో కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్న Visual Intelligence ఫీచర్‌ను కూడా ఈ సిరి మోడ్ మరింత సులభంగా ఉపయోగించుకునేలా చేస్తోంది. ఇప్పటి వరకు దీన్ని ఉపయోగించాలంటే కెమెరా కంట్రోల్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉండేది. కానీ iOS 27లో ఇది నేరుగా కెమెరా ఇంటర్‌ఫేస్‌లోనే కనిపిస్తుంది.
వివరాలు
Wallet యాప్‌లో డిజిటల్ సేవ్
కొత్తగా Visual Intelligenceలో ఫుడ్ ఐటమ్స్‌పై ఉన్న న్యూట్రిషన్ లేబుల్స్‌ను స్కాన్ చేసి డైట్ వివరాలు సేవ్ చేయడం, కాంటాక్ట్ వివరాలను నేరుగా ఫోన్‌లో సేవ్ చేయడం వంటి ఫీచర్లు రానున్నాయి. అలాగే ఈవెంట్ టికెట్లు, మెంబర్‌షిప్ కార్డులను స్కాన్ చేసి వాటిని Wallet యాప్‌లో డిజిటల్‌గా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న ప్లాంట్స్, జంతువులను గుర్తించడం, క్యాలెండర్‌లో ఈవెంట్స్ యాడ్ చేయడం, అలాగే చిత్ర సమాచారాన్ని చాట్‌జీపీటీ, గూగుల్ ఇమేజ్ సెర్చ్‌కు పంపడం వంటి ఫీచర్లు అలాగే కొనసాగుతాయి. అయితే ఇవన్నీ ఇకపై సిరి ఇంటర్‌ఫేస్‌లోనే కనిపిస్తాయి.
వివరాలు
కొత్త ఫొటోస్ యాప్
iOS 27ను Worldwide Developers Conference 2026లో జూన్ 8 నుంచి అధికారికంగా ఆపిల్ ప్రకటించనుంది . ఈ అప్‌డేట్‌లో సిరికి చాట్‌బాట్ తరహా కొత్త రూపం, ప్రత్యేక యాప్, అలాగే ఫోటోలను AIతో ఎడిట్ చేసే కొత్త ఫొటోస్ యాప్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.