Sony: PS ప్రత్యేక గేమ్స్‌ను PCకి తీసుకురావడం నిలిపేయనున్న సోనీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్లేస్టేషన్ ఎక్స్‌క్లూజివ్ గేమ్స్‌ను ఇకపై పీసీకి తీసుకురావడంపై సోనీ వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. ప్రముఖ టెక్ జర్నలిస్ట్ Jason Schreier వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్లేస్టేషన్ స్టూడియోస్ హెడ్ Hermen Hulst సోమవారం జరిగిన టౌన్‌హాల్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సింగిల్ ప్లేయర్ ప్లేస్టేషన్ గేమ్స్‌ను పీసీకి విడుదల చేసే విధానంలో సోనీ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోందని సమాచారం.
వివరాలు
పీసీ గేమింగ్ మార్కెట్‌ను విస్తరించే ప్రయత్నం చేసిన సోనీ
ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలోనే గత సంవత్సరం విడుదలైన Ghost of Yoteiతో పాటు మరికొన్ని ఇంటర్నల్‌గా రూపొందించిన గేమ్స్‌కు పీసీ వెర్షన్లను రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. గత కొన్నేళ్లుగా సోనీ తన పీసీ గేమింగ్ మార్కెట్‌ను విస్తరించే ప్రయత్నం చేసింది. ఇందులో Spider-Man 2,Ghost of Tsushima,The Last of Us,Horizon Zero Dawn Remastered వంటి సింగిల్ ప్లేయర్ గేమ్స్‌తో పాటు Helldivers 2,Marathon వంటి మల్టీప్లేయర్ టైటిల్స్‌ను కూడా పీసీలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
వివరాలు
ప్లాట్‌ఫామ్ విడుదలల విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలు
అయితే రెండేళ్ల క్రితం హర్మెన్ హల్స్ట్..ప్లేస్టేషన్ లైవ్-సర్వీస్ గేమ్స్‌ను పీఎస్5తో పాటు అదే రోజున పీసీలో కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ సింగిల్ ప్లేయర్ గేమ్స్ విషయంలో మాత్రం కంపెనీ'స్ట్రాటజిక్ అప్రోచ్'తో ముందుకెళ్తోందని తెలుస్తోంది. ఇక సోనీ మాత్రమే కాదు.. Microsoftకు చెందిన Xbox కొత్త అధిపతి Asha Sharma కూడా ఎక్స్‌క్లూజివ్ గేమ్స్‌పై సంస్థ తన వ్యూహాన్ని మళ్లీ సమీక్షిస్తున్నట్లు ఇటీవల తెలిపారు. దీంతో ప్రముఖ గేమింగ్ కంపెనీలు ఇకపై ఎక్స్‌క్లూజివ్ టైటిల్స్,క్రాస్-ప్లాట్‌ఫామ్ విడుదలల విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.