
Katy Perry: 10 నిమిషాల్లో అంతరిక్ష యాత్ర పూర్తి.. చిరంజీవి స్టైల్‌లో భూమిని ముద్దాడిన కేటీ పెర్రీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా బిజినెస్ మేగ్నేట్ జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్షయాన సంస్థ 'బ్లూ ఆరిజిన్' సోమవారం తన 11వ మానవ అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
ఈ ప్రయాణంలో ఆరుగురు మహిళలు అంతరిక్షం చేరుకున్నారు.
పాప్ స్టార్ కేటీ పెర్రీ, జర్నలిస్ట్ గేల్ కింగ్, జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ సాంచెజ్, పౌర హక్కుల లాయర్ అమండా ఇన్గుయెన్, నాసా మాజీ శాస్త్రవేత్త ఐషా బోవే, సీనీ నిర్మాత కెరియాన్ ఫ్లిన్ ఈ ప్రత్యేక ప్రయాణంలో భాగంగా అంతరిక్షం చేరుకొని భూమికి తిరిగి వచ్చారు.
ఈ మొత్తం ప్రయాణం కేవలం 10 నిమిషాల్లో పూర్తయింది. బ్లూ ఆరిజిన్ ఈ యాత్రను 'న్యూ షెపర్డ్-31 మిషన్' ద్వారా విజయవంతం చేసింది.
Details
సజావుగా ల్యాండింగ్
ఇది ఆటోమేటెడ్ రాకెట్. ప్రయాణం చేపట్టిన ఆరుగురు ఈ రాకెట్‌ను స్వతహాగా ఆపరేట్ చేయకుండా, ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా గమ్యానికి చేరుకున్నారు.
కర్మన్ రేఖ వద్ద వారు కొన్ని నిమిషాలు జీరో గ్రావిటీ అనుభవించారు. ఆ తరువాత భూమిని చూస్తూ, కొద్దిసేపు అందులో మునిగిపోయారు.
ఈ రాకెట్ ప్రయాణం 'బ్లూ ఆరిజిన్' కంపెనీ వెస్ట్ టెక్సాస్ ప్రయోగ కేంద్రం నుంచి ఆర్గనైజ్ చేశారు. మొత్తం 100 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న ఈ ప్రయాణం అంతరిక్ష సరిహద్దును దాటిన తర్వాత సజావుగా భూమిపై ల్యాండైంది.
ఈ విజయం, అంతరిక్ష పరిశోధనలో భాగంగా మరొక అడుగు ముందుకు వేసిన చర్యగా ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందింది.