LOADING...
SpaceX : స్పేస్‌ఎక్స్ రాకెట్లతో భూమి వాతావరణంలో లోహ కాలుష్యం.. సంచలన అధ్యయనం
స్పేస్‌ఎక్స్ రాకెట్లతో భూమి వాతావరణంలో లోహ కాలుష్యం.. సంచలన అధ్యయనం

SpaceX : స్పేస్‌ఎక్స్ రాకెట్లతో భూమి వాతావరణంలో లోహ కాలుష్యం.. సంచలన అధ్యయనం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష ప్రయోగాలు భూమి వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయా? తాజాగా వచ్చిన ఒక అధ్యయనం సంచలన విషయాలు బయటపెట్టింది. స్పేస్ డెబ్రిస్‌ రీ-ఎంట్రీ కారణంగా, ముఖ్యంగా స్పేస్-X రాకెట్లు తిరిగి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, భూమి పైభాగ వాతావరణంలో లోహ కాలుష్యం పెరుగుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫిబ్రవరి 19, 2025న ఫాల్కన్ 9 రాకెట్ నియంత్రణ లేకుండా తిరిగి వాతావరణంలోకి ప్రవేశించగా, యూరప్ ఆకాశంలో భారీ అగ్నిగోళం కనిపించింది. ఈ ఘటనను జర్మనీ దేశంలోని సాక్సోనీ ప్రాంతంలో ఉన్న లైడార్ కేంద్రం ద్వారా శాస్త్రవేత్తలు సమగ్రంగా పరిశీలించారు.

వివరాలు 

ఫాల్కన్ 9 రీ-ఎంట్రీ తర్వాత లిథియం స్థాయిల్లో పదింతల పెరుగుదల

ఈ పరిశోధనకు రోస్టాక్ విశ్వవిద్యాలయంలోని లైబ్నిజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అట్మాస్ఫెరిక్ ఫిజిక్స్‌కు చెందిన రాబిన్ వింగ్ నేతృత్వం వహించారు. ఫాల్కన్ 9 రీ-ఎంట్రీ జరిగిన సుమారు 20 గంటల తరువాత, భూమి పైభాగ వాతావరణంలో లిథియం అణువులు పదింతలు పెరిగినట్టు గుర్తించారు. ఆధునిక అంతరిక్ష కార్యక్రమాల వల్ల లిథియం వంటి లోహాలు వాతావరణ రసాయన నిర్మాణంలోకి చేరుతున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

వివరాలు 

రీ-ఎంట్రీ సమయంలో లోహాల విడుదల.. లిథియం మేఘం గుర్తింపు

అంతరిక్ష నౌకలు వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో చిన్న చిన్న ముక్కలుగా విరిగి కాలిపోతాయి. ఆ ప్రక్రియలో లిథియం, అల్యూమినియం వంటి లోహాలు పైభాగ వాతావరణంలోకి విడుదలవుతాయి. అంతరిక్ష వ్యర్థాల ప్రభావాన్ని అంచనా వేయడానికి లిథియంను సూచికగా తీసుకున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫిబ్రవరి 20, 2025న లైడార్ సాయంతో 94 నుంచి 97 కిలోమీటర్ల ఎత్తులో లిథియం మేఘం ఆకస్మికంగా పెరిగినట్టు గుర్తించారు. దాదాపు 27 నిమిషాల పాటు ఆ మేఘాన్ని పరిశీలించి, అది ఫాల్కన్ 9 రీ-ఎంట్రీ కారణంగానే ఏర్పడిందని నిర్ధారించారు.

Advertisement

వివరాలు 

మరింత పరిశోధన అవసరం: శాస్త్రవేత్తలు

ఒకే ఒక్క రాకెట్ రీ-ఎంట్రీ ద్వారా విడుదలైన లిథియం, అల్యూమినియం, కాపర్, లీడ్ పరిమాణం సహజంగా అంతరిక్ష ధూళి ద్వారా వచ్చే లోహాల కంటే ఎక్కువగా ఉందని అధ్యయనం చెబుతోంది. ఇది భూమిపై జీవ వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ప్రభావం పూర్తి స్థాయిలో ఏమిటో తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

Advertisement