LOADING...
SpaDex: స్పేడెక్స్‌ ఉపగ్రహాలు 3 మీటర్ల దూరం.. ఇస్రో ప్రకటన
స్పేడెక్స్‌ ఉపగ్రహాలు 3 మీటర్ల దూరం.. ఇస్రో ప్రకటన

SpaDex: స్పేడెక్స్‌ ఉపగ్రహాలు 3 మీటర్ల దూరం.. ఇస్రో ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

నింగిలో డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయోగించిన స్పేడెక్స్‌ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఎక్స్‌లో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం, ఈ ఉపగ్రహాలను మొదట 15 మీటర్ల దూరంలోకి తీసుకొచ్చారు, ఆపై దాన్ని 3 మీటర్ల దూరానికి తగ్గించారు. ఈ ప్రక్రియను విజయవంతంగా ముగించాక, రెండు ఉపగ్రహాలను సురక్షితమైన దూరంలోకి తరలించినట్లు ఇస్రో తెలిపింది. ఈ డేటా ఆధారంగా, తదుపరి డాకింగ్‌ ప్రక్రియను చేపడతామని ఇస్రో వెల్లడించింది. ఇంతకుముందు, ఆదివారం తెల్లవారు జామున 3.10 గంటలకు, ఈ ఉపగ్రహాలను 105 మీటర్ల దూరానికి చేర్చారు.

Details

వివిధ కారణాల వల్ల వాయిదా

తదనంతరం అవి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఇస్రో డాకింగ్‌ ప్రక్రియ కోసం రెండు స్పేడెక్స్‌ ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిని 'హోల్డ్‌' దశలో ఉంచింది. ఎస్‌డీఎక్స్‌01 (ఛేజర్‌) ఎస్‌డీఎక్స్‌02 (టార్గెట్‌) అనే ఈ రెండు ఉపగ్రహాలను గత నెల 30న పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా 475 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 7, 9 తేదీల్లో ఈ ఉపగ్రహాల డాకింగ్‌ ప్రక్రియను చేపట్టేందుకు నిర్ణయించారు. కానీ వివిధ కారణాల వల్ల అది వాయిదా పడింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.