LOADING...
Spotify: స్పాటిఫై బిగ్ అప్డేట్.. ప్లేలిస్ట్‌లను డైరెక్ట్‌గా స్పాటిఫైకే ట్రాన్స్‌ఫర్ చేయండి!
స్పాటిఫై బిగ్ అప్డేట్.. ప్లేలిస్ట్‌లను డైరెక్ట్‌గా స్పాటిఫైకే ట్రాన్స్‌ఫర్ చేయండి!

Spotify: స్పాటిఫై బిగ్ అప్డేట్.. ప్లేలిస్ట్‌లను డైరెక్ట్‌గా స్పాటిఫైకే ట్రాన్స్‌ఫర్ చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2025
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్పాటిఫై వినియోగదారులకు ముఖ్యమైన అప్డేట్ విడుదలైంది. ఇప్పుడు ఇతర మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లలో ఉన్న తమ ప్లేలిస్ట్‌లను నేరుగా స్పాటిఫై ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుగా కంపెనీ 'ఇంపోర్ట్ యువర్ మ్యూజిక్' అనే కొత్త ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. ఇది ఎలా పనిచేస్తుంది? ఎలా ప్లేలిస్ట్‌లను మార్చుకోవచ్చు? పూర్తి వివరాలు ఇలా...

Details

స్పాటిఫైలో కొత్త ఫీచర్ — ప్లేలిస్ట్ మైగ్రేషన్ ఇక సులభం 

ఇప్పటి వరకు యూజర్లు తమ ప్లేలిస్ట్‌లను ఇతర యాప్‌ల నుంచి స్పాటిఫైకి తెచ్చుకోవాలంటే థర్డ్ పార్టీ టూల్స్ ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పుడు అదే సర్వీస్‌ను స్పాటిఫై యాప్‌లోనికే తీసుకువచ్చింది. ఇందుకు స్పాటిఫై, ప్లేలిస్ట్ మైగ్రేషన్‌లో ప్రసిద్ధిగాంచిన TuneMyMusic సంస్థతో భాగస్వామ్యం చేసుకుంది. ఈ ఇంటిగ్రేషన్ వల్ల యూజర్లు యాప్‌లోనే ప్లేలిస్ట్‌లను తరలించుకునే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ మొబైల్ యాప్‌లోని 'Your Library' సెక్షన్‌లో కనిపిస్తోంది

Details

స్పాటిఫైలో ప్లేలిస్ట్ ట్రాన్స్‌ఫర్ ఎలా చేయాలి?

1. స్పాటిఫై యాప్‌ను ఓపెన్ చేసి Your Library సెక్షన్‌లోకి వెళ్లండి. 2. కిందికి స్క్రోల్ చేస్తే 'Import Your Music' అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. 3. దానిపై ట్యాప్ చేస్తే, ఇది కొన్ని ప్రాంప్ట్‌ల ద్వారా TuneMyMusic ప్లాట్‌ఫారమ్‌తో కనెక్ట్ చేస్తుంది. 4. తర్వాత మీరు ఏ మ్యూజిక్ యాప్ నుంచి ప్లేలిస్ట్ తరలించాలనుకుంటున్నారో (అపిల్ మ్యూజిక్, యూట్యూబ్ మ్యూజిక్, డీజర్ మొదలైనవి) ఎంచుకోవచ్చు. 5. ఎంపిక చేసిన వెంటనే, ప్లేలిస్ట్‌లు స్వయంచాలకంగా మీ స్పాటిఫై లైబ్రరీలోకి ఇంపోర్ట్ అవుతాయి. ఈ ప్రక్రియలో యాప్‌ల మధ్య మారాల్సిన అవసరం లేదు. స్పాటిఫై ఇంటర్‌ఫేస్‌లోనే మొత్తం పని పూర్తవుతుంది.

Details

 ప్లేలిస్ట్‌లను ఇంపోర్ట్ చేసిన తర్వాత లభించే ప్రాధాన్యతలు 

స్పాటిఫై మీ వినిపించే అలవాట్లను విశ్లేషించి మీకు సరిపోయే డేలీ మిక్స్‌లు, పర్సనలైజ్డ్ ప్లేలిస్ట్‌లు సృష్టిస్తుంది. స్నేహితులతో కలిసి కలబోరేటివ్ ప్లేలిస్ట్‌లు రూపొందించే అవకాశముంటుంది. స్పాటిఫై ఏఐ టూల్స్‌తో మీ ప్లేలిస్ట్‌లకు ప్రత్యేక కవర్ ఆర్ట్ డిజైన్ చేయవచ్చు అదే కాకుండా, తాజాగా వచ్చిన కొత్త ఫీచర్లలో సాంగ్-టు-సాంగ్ ట్రాన్సిషన్ అడ్జస్ట్‌మెంట్స్ మూడ్ లేదా జానర్ ఆధారంగా స్మార్ట్ మ్యూజిక్ ఫిల్టర్లు ఇప్పటికే ఉచిత, ప్రీమియం యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.

Details

 విమర్శల నడుమ వచ్చిన కీలక ఫీచర్ 

ఇటీవల స్పాటిఫై పై విమర్శలు పెరిగిన నేపథ్యంలో ఈ ఫీచర్ విడుదలైంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ కోసం విడుదలైన జాబ్ పోస్టింగ్స్ కారణంగా ప్లాట్‌ఫారమ్ బాయ్‌కాట్ ఎదుర్కొంటోంది. అదే సమయంలో సీఈఓ డేనియల్ ఏక్ సైనిక సాంకేతిక సంస్థలో పెట్టుబడి పెట్టడంతో కొందరు కళాకారులు తమ ట్రాక్‌లను స్పాటిఫై నుంచి తొలగించారు. ఈ వివాదాల మధ్య కూడా స్పాటిఫై తాజాగా తన సబ్‌స్క్రైబర్ వృద్ధిని ప్రకటించింది. కొత్తగా వచ్చిన ప్లేలిస్ట్ ట్రాన్స్‌ఫర్ టూల్, త్వరలో ప్రకటించనున్న లాస్‌లెస్ ఆడియో ఫీచర్, కొత్త యూజర్లను ఆకర్షించే అవకాశముంది.