LOADING...
ChatGPT Go: చాట్‌జీపీటీ గో సబ్‌స్క్రిప్షన్‌లో స్ట్రైప్ లోపం
చాట్‌జీపీటీ గో సబ్‌స్క్రిప్షన్‌లో స్ట్రైప్ లోపం

ChatGPT Go: చాట్‌జీపీటీ గో సబ్‌స్క్రిప్షన్‌లో స్ట్రైప్ లోపం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాకు ప్రత్యేకంగా ఓపెన్‌ఏఐ (OpenAI) ప్రారంభించిన చాట్‌జీపీటీ గో (ChatGPT Go) సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ మొదటి రోజునే సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. గ్లోబల్‌ ఫిన్‌టెక్ దిగ్గజం స్ట్రైప్ (Stripe) ద్వారా చెల్లింపుల ప్రక్రియలో సమస్య తలెత్తడంతో, యూపీఐ (UPI) పేమెంట్లు చేయలేక యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు 19న లాంచ్ చేసిన రోజు నుంచే ఈ సమస్య మొదలై ఇప్పటికీ కొనసాగుతోందని సమాచారం.

పేమెంట్ ప్రాసెసర్

ఈ అంశంపై అధికారిక ప్రకటన 

ఈ సమస్యపై ఓపెన్‌ఏఐ వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. "తాత్కాలికంగా యూపీఐ పేమెంట్లు అందుబాటులో లేవు. మేము దశలవారీగా మళ్లీ యాక్టివేట్‌ చేస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం అందరికీ ఆప్షన్ కనిపించకపోవచ్చు. 12-24 గంటల్లో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది" అని కంపెనీ వెల్లడించింది. కానీ ఈ సమస్యకు గల అసలు కారణం ఇంకా తెలియరాలేదు. టెక్నికల్‌ లోపం కావచ్చని, లేదా క్రాస్‌-బోర్డర్ పేమెంట్స్‌లోని క్లిష్టతల వల్ల కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సబ్స్క్రిప్షన్ ఫీచర్ 

ప్లాన్ ధర నెలకు ₹399 

చాట్‌జీపీటీ గో ప్లాన్‌ను ఓపెన్‌ఏఐ నెలకు ₹399కే అందుబాటులోకి తెచ్చింది. ఇది కంపెనీ అందించే అత్యంత తక్కువ ఖర్చు సబ్‌స్క్రిప్షన్‌లలో ఒకటి. దీని ద్వారా తాజా జిపిటి-5 (GPT-5) మోడల్‌తో పాటు చాట్‌జీపీటీకి చెందిన ముఖ్య ఫీచర్లను తక్కువ ధరలో పొందొచ్చు. ఇండియాలో సబ్‌స్క్రిప్షన్లకు ఐఎన్‌ఆర్‌ (INR) బిల్లింగ్‌కు మారిన తరువాత ఈ కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం రికరింగ్ పేమెంట్స్ ఉన్న క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు చేయొచ్చు. అయితే ఇండియాలో ఎక్కువ మంది ఉపయోగించే యూపీఐ ఆటోపే మాత్రం సరిగా పనిచేయకపోవడం గమనార్హం.

విస్తరణ వ్యూహం 

ఏం లభిస్తుంది?

ఈ గో ప్లాన్‌లో కనెక్టర్స్, పాత మోడల్స్ లేదా సోరా (Sora) ఉండవని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది. కానీ జిపిటి-5 మోడల్‌ను ఎక్కువ సేపు యాక్సెస్‌ చేసుకునే వీలు, మల్టీమోడల్ ఫీచర్లు మాత్రం తక్కువ ధరలో లభిస్తాయి. ఇండియన్ యూజర్ల నుండి వచ్చే స్పందనను చూసి తర్వాతి దశలో ఇతర దేశాలకు ఈ ప్లాన్‌ను విస్తరించాలా వద్ద అనేది కంపెనీ నిర్ణయించనుంది. ప్రస్తుతం ఈ సబ్‌స్క్రిప్షన్‌ ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉందని ఓపెన్‌ఏఐ స్పష్టంచేసింది.