LOADING...
 'Hybrid drone': గాలిలో ఎగురుతుంది.. నీళ్లలో ఈదుతుంది.. ఈ హైబ్రీడ్‌ డ్రోన్‌

 'Hybrid drone': గాలిలో ఎగురుతుంది.. నీళ్లలో ఈదుతుంది.. ఈ హైబ్రీడ్‌ డ్రోన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, డ్రోన్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. పౌర అవసరాలు మాత్రమే కాదు,రక్షణ రంగానికి అనుకూలంగా కూడా అనేక కొత్త మోడళ్ల డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో,డెన్మార్క్‌కు చెందిన విద్యార్థుల బృందం ఓ వినూత్న ఆవిష్కరణను ముందుకు తీసుకొచ్చింది. అది గాల్లో ఎగిరే విధంగా మాత్రమే కాకుండా,నీటిలో ఈదగలిగే ప్రత్యేకత కలిగిన హైబ్రీడ్‌ డ్రోన్‌ను రూపొందించింది. ఈ హైబ్రీడ్‌ డ్రోన్‌ను డెన్మార్క్‌లోని ఆల్‌బార్గ్‌ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల బృందం అభివృద్ధి చేసింది. వారు ఇటీవల దీన్ని విజయవంతంగా పరీక్షించారు.ఇందులో వేరియబుల్‌ పిచ్‌ ప్రొపెల్లర్‌ సిస్టమ్‌ను ఉపయోగించడం విశేషం.

వివరాలు 

డ్రోన్‌ నీటిలోకి వెళితే,బ్లేడ్‌ల యాంగిల్‌ తగ్గిపోతుంది

సాధారణంగా డ్రోన్లలో ఉండే స్థిరమైన బ్లేడ్లకు భిన్నంగా, ఇందులో మూడు అడ్జస్టబుల్‌ బ్లేడ్‌లు ఉన్నాయి. ఇవి పరిస్థితుల మేరకు తమ యాంగిల్‌ను మార్చుకునేలా తయారు చేశారు. అంటే,గాలిలో ఉన్నప్పుడు ఈ బ్లేడ్‌లు స్టీపర్‌ పిచ్‌కు మారతాయి.దీని ద్వారా అధిక థ్రస్ట్‌ ఏర్పడుతుంది,తద్వారా డ్రోన్‌ గాల్లోకి బలంగా ఎగరగలుగుతుంది. ఇక డ్రోన్‌ నీటిలోకి వెళితే,బ్లేడ్‌ల యాంగిల్‌ తగ్గిపోతుంది.ఇది నీటిలో తేలుతూ ఈదడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ వినూత్న సాంకేతికతతో తయారు చేసిన డ్రోన్‌ను పరీక్షించగా, అది అనేకసార్లు నీటిలో ఈదుతూ అక్కడి నుంచే గాల్లోకి ఎగిరింది.

వివరాలు 

రెండు పనులు ఒకేసారి చేయగలిగే హైబ్రీడ్‌ డ్రోన్లు 

ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా, అవి విస్తృతంగా వైరల్‌గా మారాయి. ఇలాంటి హైబ్రీడ్‌ డ్రోన్లకు ఇటీవలి కాలంలో విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సముద్రంలో జరిగే సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ కార్యకలాపాల్లో ఇవి బాగా ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏరియల్‌ డ్రోన్లు, అండర్‌వాటర్‌ వెహికల్స్‌ను వేర్వేరుగా వినియోగిస్తున్న తరుణంలో, ఈ రెండు పనులు ఒకేసారి చేయగలిగే హైబ్రీడ్‌ డ్రోన్లు మరింత ప్రభావవంతంగా ఉంటాయని చెబుతున్నారు.