UPI ద్వారా తప్పుడు పేమెంట్ చేశారా? చింతించకుండా ఇలా రికవరీ చేసుకోండి
UPI ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు ఒకరికి పంపాల్సిన డబ్బులను మరొకరికి పొరపాటును పంపుతుంటాము. యూపీఐ ఐడీని తప్పుగా టైప్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది. తప్పుగా పంపిన డబ్బులను విషయంలో చింతించాల్సిన అవసరం లేదు. మన డబ్బులను మనం రికవరీ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. మీరు తప్పుడు యూపీఐ ఐడీకి డబ్బును బదిలీ చేసిన సమయంలో..కంగారుపడకుండా, వెంటనే యూపీఐ కస్టమర్ కేర్ కు కాల్ చేయాలి. తప్పుడు యూపీఐ ఐడీకి డబ్బును పంపినట్లు కస్టమర్ కేర్ ప్రతినిధికి చెప్పాలి. మీరు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, మీ డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని మర్చిపోవద్దు. అన్ని సమయాల్లో డబ్బులను తిరిగి పంపడం సాధ్యకాదంటున్నారు ఇన్-సొల్యూషన్స్ గ్లోబల్ సీఈఓ నాయర్.
ఎన్‌పీసీఐ పోర్టల్, ఆర్‌బీఐకి ఫిర్యాదు ఇలా చేయండి
యూపీఐ కస్టమర్ సపోర్ట్ నుంచి సపోర్ట్ లభించకపోతే మీరు ఎన్‌పీసీఐ(NPCI) పోర్టల్ ద్వారా కూడా పిర్యాదు చేయవచ్చు. ముందుగా ఎన్‌పీసీఐ అధికారిక పోర్టల్‌కి వెళ్లాలి. What we do ట్యాబ్‌ను ఎంచుకోవాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీరు యూపీఐని ఎంచుకోండి. ఇప్పుడు Dispute Redressal Mechanismపై క్లిక్ చేయండి. అనంతరం మీరు ఫిర్యాదును నమోదు చేయాలి. తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. ఆర్బీఐకి ఫిర్యాదు ఇలా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కి కూడా ఫిర్యాదు చేయవచ్చు.ఆర్‌బీఐ వద్ద రాతపూర్వక ఫిర్యాదును దాఖలు చేయాలి. అలాగే మీరు ఆర్‌బీఐ ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ (సీఎంఎస్) పై కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఆర్‌బీఐ కార్యాలయానికి కాల్ చేయడం ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.