Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3; ఈ నెల 23న జాబిల్లిపై మిషన్ ల్యాండింగ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడిని చేరడానికి ఇప్పటికే మూడింట రెండు వంతుల దూరాన్ని పూర్తి చేసింది. తాజాగా శనివారం రాత్రి 7గంటలకు చంద్రయాన్-3 అంతరిక్ష నౌక ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్‌ను జాబిల్లి కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. భూమి చుట్టూ 5కక్ష్యలను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకున్న మిషన్ తాజాగా చంద్రుడి కక్ష్యలోకి వెళ్లింది. అన్ని అనుకున్నట్లు జరిగితే చంద్రయాన్ -3 లూనార్ ఆగస్ట్ 23 చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. మిషన్‌ను చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ఇస్రోకు ఇంకో 17 రోజుల సమయం మాత్రమే ముందు మిగిలి ఉంది.
మిషన్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో ట్వీట్
ఇప్పటి వరకు చంద్రయాన్-3 ప్రయోగం సాగిందిలా..
జులై 14న చంద్రయాన్-3 ప్రయోగించినప్పటి నుంచి శనివారంతో 22 రోజులు పూర్తవుతాయి. జులై 14, 2023న 14:35 గంటలకు శ్రీహరికోట నుంచి చంద్రయాన్ 3ని ప్రయోగించారు. జూలై 15, 2023న మిషన్ కక్ష్యను పెంచే ఎర్త్‌బౌండ్ ఫైరింగ్-1ను విజయవంతంగా పూర్తి చేశారు. జులై 17, 2023న కక్ష్య వేగాన్ని పెంచే మూడో ఫేజ్‌ను పూర్తి చేశారు. జులై 22, 2023న నాలుగో భూకక్ష్యలో మిషన్‌ను ఇస్రో ప్రవేశపెట్టింది. ఆగష్టు 1, 2023న స్పేస్‌క్రాఫ్ట్ ట్రాన్స్‌లూనార్ ఆర్బిట్‌లోకి ఇస్రో ప్రవేశపెట్టింది. ఆగస్టు 5న లూనార్-ఆర్బిట్ ఇన్సర్షన్ చంద్రుడి కక్ష్యలోకి వెళ్లింది. ప్రస్తుతం మిషన్ చంద్రుడి వైపు దూసుకెళ్తోంది.