NASA: కల్పనా చావ్లా మాదిరే సునీతా.. నాసా సంచలన రిపోర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
నాసా నాస్కో కొలంబియా స్పేస్ షటిల్ డిజాస్టర్ (Columbia Space Shuttle Disaster) ప్రజలకు ఎప్పటికీ మర్చిపోలేనిదే. భూమికి తిరిగి రాబోతోంది సమయంలో ఈ కొలంబియా వ్యోమనౌక కూలిపోయి ఘోర ప్రమాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కల్పనా చావ్లా మృతి చెందారు. అయితే 2024లో 8 రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్ కూడా దాదాపుగా ఇలాంటి ప్రమాద పరిస్థితిని ఎదుర్కొన్నారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) 311 పేజీల నివేదికలో తెలిపింది. ఫిబ్రవరి 19, 2026న విడుదలైన నివేదికలో, సునీతా విలియమ్స్ మిషన్‌లో తీవ్ర లోపాలు ఉన్నాయని నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఇసాక్‌మాన్ (Jared Isaacman) స్పష్టం చేశారు.
Details
అంతరిక్ష కేంద్రంలో 9 నెలలు
ఈ లోపాలను నాసా, బోయింగ్ (Boeing) సంస్థలు గమనించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన సునీతా విలియమ్స్, ఇతర సిబ్బందితో కలిసి బోయింగ్ స్టార్‌లైనర్ (Boeing Starliner) నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కి చేరారు. అయితే, ఆ తర్వాత స్టార్‌లైనర్‌లో ప్యూయల్ లీకేజీ వంటి సాంకేతిక సమస్యలు ఎదురై 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకున్నారు.
Details
మార్చి 18న డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా భూమికి
ఈ పరిస్థితి, కొలంబియా షటిల్ డిజాస్టర్ మరియు ఛాలెంటజర్ (Challenger) ప్రమాదాల మాదిరిగా తీవ్రంగా భావించింది. నివేదికలో నాసా ఈ మిషన్‌ను "టైప్ A" ప్రమాదంగా (Type A hazard) పేర్కొంది. 300 కంటే ఎక్కువ పేజీల నివేదికలో, తప్పుడు ఇంజనీరింగ్, సరైన పర్యవేక్షణ లేకపోవడం స్టార్‌లైనర్ విఫలానికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. తుదికి, 9 నెలల తర్వాత, సునీతా విలియమ్స్ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ (SpaceX Crew Dragon) క్యాప్సూల్ ద్వారా భూమికి విజయవంతంగా తిరిగి వచ్చారు. బోయింగ్ స్టార్‌లైనర్‌తో వారు 2024 జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరి, 2025 మార్చి 18న డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా భూమికి వచ్చారు.