Sunita Williams: సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ రాకపై ఉత్కంఠ.. షెడ్యూల్ కంటే ముందేగానే భూమికి రాక
ఈ వార్తాకథనం ఏంటి
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ వారం రోజుల మిషన్ కోసం వెళ్లి, సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
సాంకేతిక లోపాల కారణంగా ఈ ఇద్దరు వ్యోమగాములు ఇప్పటికే 8 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు.
వారిని భూమికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు పలు మార్లు విఫలమయ్యాయి.
ఈ నేపథ్యంలో వారి రాకపై ఉత్కంఠ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం, వీరు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే త్వరలోనే భూమిపైకి రానున్నట్టు తెలుస్తోంది.
తాజా రీ-షెడ్యూల్ ప్రకారం, అన్నీ సజావుగా జరిగితే వీరు మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో భూమిపైకి తిరిగి వస్తారని నాసా గతంలో ప్రకటించింది.
Details
మార్చి 12న రాక?
కానీ అంతకంటే ముందే వీరి రాక సాధ్యమవుతుందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
నాసా వర్గాల సమాచారం ప్రకారం, మార్చి 12 నాటికి వీరిని భూమికి తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇందుకోసం స్పేస్ ఎక్స్ 10 మిషన్‌లో ఉపయోగించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ను ఉపయోగించనున్నట్టు సమాచారం.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్ 2023 జూన్‌లో బోయింగ్ స్టార్‌లైన్ స్పేస్‌షిప్ ద్వారా ఐఎస్ఎస్‌కి వెళ్లారు.
వాస్తవానికి, వీరి మిషన్ కేవలం వారం రోజుల పాటు మాత్రమే ఉండాలి. జూన్ 6న ఐఎస్ఎస్‌కి వెళ్లిన వీరు, జూన్ 14న భూమికి తిరిగి రావాల్సి ఉంది.
Details
తిరుగు ప్రయాణం పలుసార్లు వాయిదా
కానీ, స్టార్‌లైనర్‌లో హీలియం లీకేజీ వంటి సాంకేతిక లోపాలు తలెత్తడంతో వారి తిరుగు ప్రయాణం పలుమార్లు వాయిదా పడింది.
నాసా, స్పేస్ ఎక్స్ కలిసి వీరిని భూమికి రప్పించేందుకు పలు మార్లు ప్రయత్నాలు చేశాయి. ఫిబ్రవరి 2025లో వీరిని భూమికి తిరిగి తీసుకురావడానికి నాసా ప్రణాళికలు సిద్ధం చేసింది.
కానీ, ఈ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో వారు మరొక నెల రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే తాజా అప్‌డేట్ ప్రకారం వీరు ముందుగా భావించిన సమయానికంటే తొందరగానే భూమిపైకి రానున్నారు.