Page Loader
Sunita Williams: 225 రోజుల పాటు కక్ష్యలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. 6 గంటల సుదీర్ఘ అంతరిక్ష నడక పూర్తి 
Sunita Williams: సునీతా విలియమ్స్.. 6 గంటల సుదీర్ఘ అంతరిక్ష నడక పూర్తి

Sunita Williams: 225 రోజుల పాటు కక్ష్యలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. 6 గంటల సుదీర్ఘ అంతరిక్ష నడక పూర్తి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సంతతి వ్యోమగామి, ఐఎస్‌ఎస్‌ స్టేషన్‌ కమాండర్‌ సునీతా విలియమ్స్‌ దినచర్య గురువారం కాస్త భిన్నంగా సాగింది. దాదాపు ఏడు నెలల పాటు వివిధ శాస్త్రీయ ప్రయోగాలతో బిజీగా గడిపిన ఆమె, గురువారం ఐఎస్‌ఎస్‌ వెలుపలికి వెళ్లి స్పేస్‌వాక్‌ చేశారు. స్పేస్‌వాక్‌ అంటే ఏమిటి? ఐఎస్‌ఎస్‌ వెలుపలకి వెళ్లి, కాసేపు అంతరిక్షంలో స్వేచ్ఛగా విహరించడమే స్పేస్‌వాక్‌. నాసా వ్యోమగామి నిక్‌ హేగ్‌తో కలిసి సునీతా విలియమ్స్‌ ఐఎస్‌ఎస్‌కు అవసరమైన మరమ్మతులు చేశారు. ఆ సమయంలో ఐఎస్‌ఎస్‌ తుర్క్‌మెనిస్తాన్‌ ప్రాంతానికి 260 మైళ్ల ఎత్తులో ఉంది. గతంలోనూ సునీతా ఐఎస్‌ఎస్‌ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో ఈ స్పేస్‌వాక్‌ ఆమెకు ఎనిమిదోది కావడం విశేషం.

వివరాలు 

స్టార్‌ లైనర్‌ మిషన్‌ అనుభవాలు 

2022 జూన్‌లో బోయింగ్‌ సంస్థ రూపొందించిన స్టార్‌ లైనర్‌ క్రూ క్యాప్సూల్‌ ద్వారా సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ఈ మిషన్‌ వారానికి మాత్రమే పరిమితమవుతుందని భావించినా, సాంకేతిక సమస్యల కారణంగా వాళ్ల ప్రయాణం వాయిదా పడింది. థ్రస్టర్‌ ఫెయిల్యూర్లు, హీలియం లీకేజీల కారణంగా సెప్టెంబర్‌ 7న క్యాప్సూల్‌ ఇద్దరి లేకుండానే భూమికి చేరింది. ప్రయోగశాలలో వారి పాత్ర టెంపరరీ విజిటర్స్‌గా వెళ్లిన సునీతా,విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌ పూర్తి స్థాయి సిబ్బందిగా మారారు. స్పేస్‌వాక్‌లు, మరమ్మతులు చేయడంతో పాటు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. నాసా ఈ పరిస్థితిని విపత్కరంగా పరిగణించి, ఇలాంటి సమయాల్లో వ్యోమగాములను రక్షించే చిట్కాలను అందిస్తే రూ. 17 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది.

వివరాలు 

ఆరోగ్యంపై ఆందోళనలు 

అంతరిక్షంలో దీర్ఘకాలం ఉండడం వల్ల సునీతా ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు వచ్చాయి. గురుత్వాకర్షణ లేని వాతావరణంలో ఎముకలు, కండరాలు బలహీనపడటం సాధారణం. రోజూ రెండున్నర గంటల వ్యాయామం చేయడం తప్పనిసరి. తాజా ఫొటోలు, వీడియోల ప్రకారం ఆమె బరువు తగ్గినట్లు స్పష్టమైంది. నాసా మాత్రం సునీతా ఆరోగ్యం గురించి వస్తున్న కథనాలను పుకార్లుగా కొట్టిపారేసింది. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ నిర్ధారిస్తుంది. అనుమానాలు నివారించేందుకు సునీతా స్వయంగా వీడియో విడుదల చేసి, తన క్షేమాన్ని తెలియజేశారు.

వివరాలు 

ఐఎస్‌ఎస్‌ విశేషాలు 

1998లో ప్రారంభమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నాసాతో పాటు ఐదు దేశాల సహకారంతో నిర్వహించబడుతోంది. ఇది భూమి ఉపరితలానికి 400 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్‌ (LEO) వద్ద ఉంది. దీని బరువు 4,45,000 కిలోలు. ప్రస్తుతం 59 ఏళ్ల సునీతా విలియమ్స్‌ ఐఎస్‌ఎస్‌ కమాండర్‌గా ఉన్నారు. సునీతా విలియమ్స్‌ ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం, శాస్త్రీయ పరిశోధనల్లో ఆమె కృషి ప్రతిభావంతమైనది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐఎస్‌ఎస్‌ చేసిన ట్వీట్