Loading...
Mega El Niño: మెగా ఎల్ నినోతో ప్రపంచానికి ముప్పు.. పసిఫిక్‌లో 10 డిగ్రీలు పెరిగిన వేడి!
మెగా ఎల్ నినోతో ప్రపంచానికి ముప్పు.. పసిఫిక్‌లో 10 డిగ్రీలు పెరిగిన వేడి!

Mega El Niño: మెగా ఎల్ నినోతో ప్రపంచానికి ముప్పు.. పసిఫిక్‌లో 10 డిగ్రీలు పెరిగిన వేడి!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న అసాధారణ వాతావరణ మార్పులు శాస్త్రవేత్తల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గాలాపగోస్ దీవులు, పెరూ తీర ప్రాంతాలకు సమీపంలోని సముద్ర జలాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. ఎల్ నినో ప్రభావం తీవ్రరూపం దాల్చుతుండటమే ఈ పరిణామానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

మెగా ఎల్ నినోగా అభివర్ణించిన శాస్త్రవేత్త

అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మౌ.. పసిఫిక్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాన్ని 'మెగా ఎల్ నినో'గా అభివర్ణించారు.

యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ (ECMWF) అందించిన డేటా ఆధారంగా రూపొందించిన వాతావరణ మ్యాప్‌ను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇందులో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిన ప్రాంతాలను వివరించారు.

అయితే, పసిఫిక్ మహాసముద్రం మొత్తం 10 డిగ్రీల సెల్సియస్ వేడెక్కిందని భావించకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈ స్థాయి ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రధానంగా తూర్పు పసిఫిక్‌లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది.

సముద్రంలోని విస్తృత మధ్య ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

వివరాలు 

గత రికార్డులను అధిగమించే అవకాశం

ఎల్ నినో ప్రభావం గణనీయంగా బలపడినట్లు అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) కూడా ధ్రువీకరించింది.

1950 నుంచి నమోదైన ఎల్ నినో రికార్డులను ఈసారి అధిగమించే అవకాశం 60 శాతం ఉందని అంచనా వేసింది.

ముఖ్యంగా 1997-98, 2015-16 సంవత్సరాల్లో నమోదైన అత్యంత శక్తిమంతమైన ఎల్ నినో పరిస్థితులను కూడా ప్రస్తుత పరిణామాలు మించిపోయే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) సైతం ఇదే తరహా అంచనాలను వెల్లడించింది.

ప్రస్తుత ఎల్ నినో చరిత్రలో నమోదైన అత్యంత బలమైన ఎల్ నినోల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

2027 ఆరంభం వరకు ప్రభావం?

ప్రస్తుత ఎల్ నినో ప్రభావం 2027 ప్రారంభం వరకు కొనసాగవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది.

దీని ప్రభావంతో రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది.

సాధారణంగా ఎల్ నినో పరిస్థితులు ఏర్పడినప్పుడు ఉష్ణమండల పసిఫిక్ సముద్రంలో నిల్వ ఉన్న అధిక వేడి వాతావరణంలోకి విడుదలవుతుంది.

ఫలితంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ఇదిలా ఉండగా,గత అక్టోబర్‌లోనే పెరూ తీర ప్రాంతం,గాలాపగోస్ దీవులకు పశ్చిమాన ఉన్న సముద్ర జలాల్లో ఉష్ణోగ్రతలు 6 నుంచి 7డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ డేటా వెల్లడించింది.

తాజా పరిణామాలు ఎల్ నినో తీవ్రతపై మరిన్ని ఆందోళనలను పెంచుతున్నాయి.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ వేడి.. మెగా ఎల్ నినోతో ఆందోళన

ADVERTISEMENT