
WhatsApp: ఇన్‌స్టాగ్రామ్ తరహాలో వాట్సాప్‌లో ట్యాగ్ సదుపాయం.. ఎలా ఉపయోగించాలంటే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌లో తాజాగా ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
ఇది వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది. గత కొంతకాలంగా వాట్సప్ 'మెన్షన్' ఫీచర్‌ను జోడించడానికి ప్రయత్నిస్తోంది.
తాజాగా దీనిని యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలను అప్‌లోడ్ చేస్తున్నప్పుడు నచ్చిన వ్యక్తులను '@' గుర్తుతో ట్యాగ్ చేయడం అందరికి తెలిసిన విషయం.
ఈ విధంగా ట్యాగ్ చేసిన వారు మీ స్టోరీ గురించి నోటిఫికేషన్ పొందుతారు. వాట్సప్ కూడా ఇదే విధమైన సదుపాయాన్ని అందిస్తోంది.
దీంతో ఇకపై వినియోగదారులు తమ స్టేటస్‌ను అప్‌డేట్ చేసే సమయంలో కాంటాక్ట్‌లోని నచ్చిన వ్యక్తులను ట్యాగ్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది.
Details
అందుబాటులో 'మెన్షన్' ఫీచర్
వాట్సప్‌లో స్టేటస్ అప్‌లోడ్ సమయంలో 'యాడ్ క్యాప్షన్' బార్‌కు కుడివైపున ఉన్న '@' ఐకాన్‌పై క్లిక్ చేస్తే, మీ కాంటాక్ట్స్ అందరూ కనిపిస్తారు.
మీరు ఇష్టపడిన వ్యక్తులను మెన్షన్ చేయవచ్చు. మెన్షన్ చేసిన వ్యక్తులకు సంబంధిత నోటిఫికేషన్ అందుతుంది, అయితే ఇన్‌స్టాగ్రామ్ వంటి విధానంలో ట్యాగ్ చేసిన వ్యక్తుల పేర్లు అందరికీ కనిపించవు.
ఇది వినియోగదారుల గోప్యతను కాపాడడానికి రూపొందించారు. ఈ 'మెన్షన్' ఫీచర్ ఇప్పటికే చాలా యూజర్లకు అందుబాటులో ఉంది.