5 Major Events in Science & Tech 2023:2023లో సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ సాధించిన విజయాలపై ఓ లుక్కేయండి
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయంగా నేడు సాంకేతిక రంగంలో భారతీయులు ఎన్నో విజయాలు సాధించింది.
టెక్నాలజీ రంగంలో కూడా ఎన్నో ఒడిదుడుగులు అధిగమించి ముందుకెళ్లింది.
ముఖ్యంగా ఈ ఏడాది అంతరిక్ష కార్యక్రమాల్లో సొంతంగా విజదుంధుబి మోగించి ప్రత్యర్థి దేశాలకు సవాల్ విసిరింది.
ఈ ఏడాది చంద్రయాన్-3 ను శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్ర నుంచి జులై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌విఎమ్-3 ఎమ్4 రాకెట్లో అంతరిక్షంలోకి పంపించారు.
యావత్ భారతదేశం సహా వివిధ దేశాలు చంద్రయాన్ 3 కోసం ఎదుచూశాయి.
చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా కాలు మోపడంతో భారత్ చరిత్ర సృష్టించింది.
Details
మరో మైలురాయిని అందుకున్న ఇస్రో
అదే విధంగా భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయిని అందుకుంది.
సుర్యడిపై పరిశోధన క్రమంలో ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
ఆదిత్య ఎల్1 జీవితకాలం ఐదేళ్లని ఇప్పటికే శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పటివరకు భూమికి ఫొటోలు పంపుతూనే ఉంటుందన్నారు.
అయితే ఇంధనం ఖర్చు చేసే ఆధారంగా ఇది 5ఏళ్ల కన్నా ఎక్కువ కాలం కూడా పనిచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Details
ఐఫోన్ నుండి ఫోన్లు, వాచెస్.. శాంసంగ్ నుండి కొత్త ఫోన్స్
మరోవైపు టెక్నాలజీ రంగంలో భారత్ మరింత వేగంగా దూసుకెళ్తుతోంది. ఈ ఏడాదే ఆపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసింది.
ఐఫోన్ 15, ఐఫోన్ 15ప్లస్, ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే మోడల్స్ భారతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.
దాంతో బట్టుగా ఆపిల్ వాచ్ సిరీస్ 9, అల్ట్రా వాచ్-2ని కంపెనీ ఆవిష్కరించింది.
ఇదే సంవత్సరంలో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ 'శాంసంగ్' Samsung Galaxy Z fold 5 లాంచ్ చేసింది.
ఇది ఫోల్డ్ చేయగలిగే స్మార్ట్ ఫోన్ అని సంస్థ ప్రకటించింది.
Details
ఎడిటింగ్ యాప్ ను లాంచ్ చేసిన యూట్యూబ్
జూలై 26న ఆ సంస్థ Galaxy Z Flip 5, Galaxy Z Fold 5, Galaxy 6 వాచ్, Galaxy Buds 3, truly wireless stereo ఇయర్‌ఫోన్‌లు లాంచ్ చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 అల్ట్రా 5జీ మోడల్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారం అయిన యూట్యూబ్ సెప్టెంబర్ 22న సరికొత్త ఎడిటింగ్ యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ యూట్యూబ్ క్రియేట్ ద్వారా ఫ్రీగా వీడియోలను ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆర్టీఫిషియల్ ఇంటెజెన్స్ సాయంతో ఈ యాప్ అందరికి సౌకర్యంగా ఉంది.