Tariff impact: అక్టోబర్ 2024లో రిలయన్స్ జియోకి 3.76 మిలియన్ల కస్టమర్‌లు గుడ్ బై
టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)ప్రతి నెల మాదిరిగానే అక్టోబర్ నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాలు టెలికాం రంగంలో ఏ కంపెనీ బలంగా ఉందో,ఏ కంపెనీ నెట్‌వర్క్ బలహీనంగా ఉందో స్పష్టంగా తెలియజేస్తాయి. కస్టమర్లు ఏ టెలికాం సేవలను అధికంగా ఇష్టపడుతున్నారో,ఏ సేవలను తక్కువగా ఉపయోగిస్తున్నారో అంచనా వేయడంలో ఈ డేటా ఉపయోగకరంగా ఉంటుంది. దేశంలో టెలికాం విప్లవం ఎలా ముందుకు సాగుతోంది, దానిని వివిధ రంగాలు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాయో కూడా దీనివల్ల అర్థం అవుతుంది. అక్టోబర్ నెలలో రిలయన్స్ జియో తన 37లక్షల 60వేల మంది చందాదారులను కోల్పోయింది. సెప్టెంబర్‌లో 46 కోట్ల 37 లక్షల మంది కస్టమర్ల సంఖ్య అక్టోబర్‌లో 46 కోట్లకు తగ్గింది.
వొడాఫోన్ ఐడియా తన కస్టమర్ బేస్‌ను మరింతగా కోల్పోతోంది
అయితే, యాక్టివ్ యూజర్ బేస్ పరంగా జియో బలంగా ఉండటం దీని వ్యాపార వ్యూహం మెరుగ్గా ఉన్నదనికీ సంకేతం. మరోవైపు, వొడాఫోన్ ఐడియా 19 లక్షల 77 వేల మంది చందాదారులను కోల్పోయి, యాక్టివ్ యూజర్ సంఖ్యలో ఏడు లక్షల 23 వేల మంది తగ్గుదల చవిచూసింది. భారతి ఎయిర్ టెల్ అక్టోబర్‌లో 27 లక్షల 23 వేల మంది యాక్టివ్ యూజర్లను చేర్చుకున్నప్పటికీ, జియోతో పోలిస్తే వెనుకబడి ఉంది. ఈ డేటా ప్రకారం, జియో తన యాక్టివ్ యూజర్లతో స్థిరమైన మార్కెట్ ఉనికి చూపుతుండగా, వొడాఫోన్ ఐడియా తన కస్టమర్ బేస్‌ను మరింతగా కోల్పోతూ ఉంది.