
PSLV C 61: పీఎస్‌ఎల్‌వీ-సీ61 మిషన్ లో సాంకేతిక సమస్య.. ఇస్రో అధికారిక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఇస్రో ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ప్రయోగంలో మూడో దశలో సాంకేతిక విఘాతం ఎదురైనట్లు ఇస్రో చైర్మన్ నారాయణ తెలిపారు. వివరాల ప్రకారం, ఇస్రో 101వ రాకెట్ ప్రయోగంగా పీఎస్‌ఎల్‌వీ-సీ61ను ఆదివారం తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది.
అయితే ఆకాశంలోకి లాంచ్ అయిన కొద్దిసేపటికే రాకెట్ మూడో దశలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ స్పందిస్తూ, ఈ మిషన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని, మూడో దశలో ఏర్పడిన సమస్య కారణంగా ప్రయోగం అసంతృప్తిగా ముగిసిందని ప్రకటించారు.
Details
త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తాం
సమస్యకు గల కారణాలను విశ్లేషించి, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
ఈ ప్రయోగంలో అత్యాధునిక నిఘా సామర్థ్యం గల ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-09)ను పీఎస్‌ఎల్‌వీ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది.
ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూఉపరితలాన్ని హై రిజల్యూషన్‌లో స్పష్టంగా చిత్రీకరించగలదు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఈ శాటిలైట్ సజావుగా పనిచేయగలగడం ప్రత్యేకత.
దీని బరువు సుమారు 1710 కిలోలు. EOS-09 ఉపగ్రహం భూమి కక్ష్యలో నిఘానేత్రంగా పనిచేస్తూ, దేశ సరిహద్దుల్లో శత్రు కదలికలపై ప్రత్యేకంగా పర్యవేక్షణ నిర్వహించనుంది.
అత్యంత చిన్న వస్తువులను గుర్తించగల సామర్థ్యం కలిగిన అల్ట్రా హై రిజల్యూషన్ ఇమేజింగ్ టెక్నాలజీ ఈ ఉపగ్రహంలో ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రయోగం విఫలం
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches PSLV-C61, which carries the EOS-09 (Earth Observation Satellite-09) into a SSPO orbit, from Sriharikota, Andhra Pradesh.
— ANI (@ANI) May 18, 2025
EOS-09 is a repeat satellite of EOS-04, designed with the mission objective to ensure remote… pic.twitter.com/4HVMZzXhP0