తదుపరి వార్తా కథనం

Instagram Down: ఇన్‌స్టాగ్రామ్‌లో సాంకేతిక సమస్యలు.. సేవల్లో అంతరాయం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 08, 2024
01:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
మెటా పరిధిలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌కు బుధవారం సేవల్లో అంతరాయం ఏర్పడింది.
ఇది వినియోగదారులకు అనేక సాంకేతిక సమస్యలను కలిగించింది. ఇండియాలో మంగళవారం ఉదయం 11:15 గంటల సమయంలో యూజర్లు లాగిన్ చేయడం, సర్వర్ కనెక్షన్ వంటి సమస్యలను ఎదుర్కొన్నారు.
డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం, 64శాతం కంటే ఎక్కువ మంది యూజర్లు యాప్‌లోకి లాగిన్ అవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
Details
ఇబ్బందులు ఎదుర్కొన్న యూజర్లు
24శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలు ఉన్నట్లు నివేదించారు. యూజర్లు ఈ అంతరాయాన్ని ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా పంచుకున్నారు.
ఇందులో కొందరు 'సమ్ థింగ్ వెంట్ రాంగ్' అనే సందేశం స్క్రీన్‌పై వస్తున్నట్లు తెలిపారు.
ఈ పరిస్థితి వల్ల యూజర్లు అయోమయానికి గురయ్యారు.
మీరు పూర్తి చేశారు