Telegram: కొత్త అప్డేట్స్ ను తీసుకొచ్చిన టెలిగ్రామ్.. స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
టెలిగ్రామ్ అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్‌లలో ఒకటి.
మెసేజ్‌లు పంపడం మాత్రమే కాకుండా, వినియోగదారులకు అత్యాధునిక ఫీచర్లను అందించడంలో ఈ యాప్ ఎప్పటికప్పుడూ అభివృద్ధి చెందుతోంది.
ఈ క్రమంలోనే, తాజాగా టెలిగ్రామ్ కొత్త అప్డేట్‌ను విడుదల చేసింది.
ఈ అప్‌డేట్ యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా, భద్రతను మరింత పెంచే విధంగా రూపొందించబడింది.
వివరాలు
కొత్త 'కాంటాక్ట్ కన్ఫర్మేషన్' ఫీచర్
ఈ కొత్త అప్‌డేట్‌లో ముఖ్యమైన ఫీచర్ 'కాంటాక్ట్ కన్ఫర్మేషన్' (Contact Confirmation).
టెలిగ్రామ్ యూజర్లకు ఎవరో కొత్త నంబర్ నుంచి మెసేజ్ పంపినప్పుడు, ఆ నంబర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే వీలుంటుంది.
ప్రత్యేకంగా, ఆ టెలిగ్రామ్ ఖాతా ఎప్పుడు క్రియేట్ అయ్యిందో తెలుసుకోవచ్చు. అలాగే, ఆ నంబర్ ఏ దేశానికి చెందినదో, మీకు మెసేజ్ పంపిన వ్యక్తి మీతో ఏదైనా గ్రూప్‌లో ఉన్నారా? అనే సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా, ఆ అకౌంట్ వెరిఫైడ్ అయినదా లేదా సాధారణ ఖాతా (Regular Account)నా అన్నది కూడా తెలుసుకోవచ్చు.
ఈ ఫీచర్ వల్ల స్పామ్ మెసేజ్‌లు, అనవసరమైన నంబర్ల నుంచి వచ్చే సందేశాలను అడ్డుకోవచ్చు.
వివరాలు
ప్రీమియం యూజర్లకు అదనపు ఫీచర్లు
ప్రీమియం వినియోగదారులకు మరిన్ని ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.
ముఖ్యంగా, కొత్త నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను ఫిల్టర్ చేసే ప్రత్యేకమైన వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చారు.
దీని ద్వారా స్పామ్ మెసేజ్‌లు, స్పామ్ కాల్స్ తగ్గే అవకాశం ఉంది. ఇకపై, కేవలం మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారినుంచే మెసేజ్‌లు స్వీకరించగలుగుతారు.
అదనంగా, ప్రొఫైల్ కవర్‌ను గిఫ్ట్ చేయడానికీ కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
వివరాలు
ఇతర ముఖ్యమైన అప్‌డేట్స్
టెలిగ్రామ్ ఈ కొత్త వెర్షన్‌లో పలు అదనపు ఫీచర్లను తీసుకువచ్చింది..
ఎమోజీ రియాక్షన్స్ - మెసేజ్‌లకు తక్షణమే ఎమోజీలతో స్పందించే అవకాశం
అడ్వాన్స్డ్ సెర్చ్ ఫిల్టర్ - మెసేజ్‌లను మరింత వేగంగా వెతికే ప్రత్యేకమైన ఫిల్టర్
కస్టమ్ ఎమోజీ ఫోల్డర్లు - మీకు నచ్చిన ఎమోజీలను ప్రత్యేక ఫోల్డర్లలో ఏర్పాటు చేసుకునే వీలుంది
క్యూఆర్ కోడ్ స్కానర్ - టెలిగ్రామ్‌లో మరింత వేగంగా కాంటాక్ట్‌లను యాడ్ చేసుకునే వీలుంటుంది
సర్వీస్ మెసేజ్‌లకు ఎమోజీ రియాక్షన్ - ముఖ్యమైన నోటిఫికేషన్‌లకు ఎమోజీల ద్వారా స్పందించే ఫీచర్
వివరాలు
మెసేజింగ్ నెక్స్ట్ లెవల్
టెలిగ్రామ్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను అందిస్తూ, మెసేజింగ్‌ను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మార్చే ప్రయత్నం చేస్తోంది.
తాజా అప్‌డేట్ ద్వారా మెసేజింగ్ అనుభవాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. భవిష్యత్తులో మరిన్ని అప్‌డేట్‌లతో టెలిగ్రామ్ మరింత ఆకర్షణీయమైన యాప్‌గా మారే అవకాశముంది!