Sunita Williams: అంతరిక్ష ప్రయాణం ప్రభావం.. భరించలేని సమస్యలతో సునీతా విలియమ్స్
ఈ వార్తాకథనం ఏంటి
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉండిపోయిన అనంతరం భూమికి తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది.
నాసా-స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ-10 ఐఎస్ఎస్ చేరుకుంది. శుక్రవారం ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్-9 రాకెట్ సహాయంతో క్రూ-10 అంతరిక్షంలోకి ప్రయాణించింది.
రిటర్న్ జర్మీలో సునీతా విలియమ్స్ భూమిపైకి రానున్నారు. అంతరిక్షంలో గడిపిన దీర్ఘకాలం కారణంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
వారు భూమికి తిరిగి రావడం ఎంతో కష్టం మరియు బాధతో కూడుకున్న ప్రక్రియ. వ్యోమగాములకు 'బేబీ ఫుట్' అనే ఆరోగ్య సమస్య ఏర్పడే అవకాశం ఉంది.
Details
సాధారణ స్థితికి రావడానికి కొన్ని నెలలు సమయం పట్టే అవకాశం
అంతరిక్షంలో నెలల తరబడి గడిపే కారణంగా వారి పాదాలు చాలా మృదువుగా మారుతాయి. భూమిపై తిరిగి అడుగుపెట్టిన తర్వాత నడవడం వారికి తీవ్రమైన బాధను కలిగించొచ్చు.
భూమిపై ఉండే సమయంలో మన పాదాల చర్మం గురుత్వాకర్షణ, ఘర్షణ కారణంగా గట్టిగా మారుతుంది. ఇది మన పాదాలను నొప్పి, అసౌకర్యం నుంచి రక్షిస్తుంది.
కానీ అంతరిక్షంలో గడిపిన వారు ఈ గట్టిపడిన చర్మాన్ని కోల్పోతారు. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి వారాల నుంచి నెలల వరకు సమయం పట్టొచ్చు.
అంతేకాకుండా అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో వ్యోమగాముల ఎముకల సాంద్రత గణనీయంగా తగ్గిపోతుంది.
Details
కండరాలు బలహీనపడతాయి
నాసా ప్రకారం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, ప్రతి నెలా వ్యోమగాములు వారి ఎముక డెన్సిటీని ఒక శాతం కోల్పోతారు. అదనంగా కండరాలు బలహీనపడటం వల్ల భూమిపైకి వచ్చిన వెంటనే వారు సాధారణంగా నడవలేరు.
శరీర సామర్థ్యాన్ని తిరిగి పొందడానికి నెలల పాటు ప్రత్యేక శిక్షణ అవసరమవుతుంది. అంతరిక్షంలో గడిపినప్పుడల్లా వ్యోమగాముల రక్త పరిమాణం కూడా తగ్గిపోతుంది.
భూమిపై ఉండే సమయంలో గుండె రక్తాన్ని శరీరమంతా పంప్ చేయాల్సి వస్తుంది. కానీ గురుత్వాకర్షణ లేని వాతావరణంలో గుండెకు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు.
దీని ఫలితంగా రక్త ప్రవాహ మార్గం మారుతుంది, కొన్ని ప్రాంతాల్లో నెమ్మదిస్తుంది,
Details
రక్తం గడ్డకట్టే ప్రమాదం
తద్వారా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. అంతరిక్ష జీవితం వ్యోమగాములను అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్‌కి గురిచేస్తుంది.
భూమి యొక్క అయస్కాంత క్షేత్రం మనలను రేడియేషన్ నుంచి రక్షిస్తుంది.
అయితే అంతరిక్షంలో ఉండే వ్యోమగాములకు ఇది అందుబాటులో ఉండదు. నాసా తెలిపిన ప్రకారం, వ్యోమగాములు ప్రధానంగా మూడు రకాల రేడియేషన్‌కు గురవుతారు.
వీటిలో భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో చిక్కుకున్న కణాలు, సూర్యుని నుండి వచ్చే సౌర అయస్కాంత కణాలు, గెలాక్సీ కాస్మిక్ కిరణాలు ఉన్నాయి.