స్వీయ- అభ్యాస బ్రెయిలీ పరికరం 'Annie' గురించి తెలుసుకుందాం
గోవాలోని BITS పిలానీకి చెందిన అమన్ శ్రీవాస్తవ, అతని ముగ్గురు స్నేహితుల మధ్య టిఫిన్ తింటున్నప్పుడు ప్రారంభమైన సంభాషణ ఒక పరిశోధన ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంది. ఆ విధంగా బెంగళూరుకు చెందిన టింకర్‌బెల్ ల్యాబ్స్ దృష్టి లోపం ఉన్న పిల్లలకు బ్రెయిలీ లిపిని నేర్పడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి స్వీయ-అభ్యాస పరికరం 'Annie'ని అభివృద్ధి చేసింది. శ్రీవాస్తవ దృష్టి లోపం ఉన్నవారికి ప్రారంభ విద్యను అందించడానికి అవసరమైన సరైన సాధనాలు లేకపోవడం చూశాడు. " పిల్లలకు ABC బోధించేటప్పుడు, బోధన కారణంగా వాళ్ళు ABC నేర్చుకోరు. ప్రతిచోటా, ప్రతి పుస్తకంలో, ప్రతి సైన్‌బోర్డ్‌లో చూసి నేర్చుకుంటారు. కానీ దృష్టి లోపం ఉన్న పిల్లలకు బోధించే విషయంలో అటువంటి సౌకర్యం లేదు" అని వివరించాడు.
ఈ పరికరం సౌకర్యవంతంగా నేర్చుకునే వీలు కల్పిస్తుంది
సాంప్రదాయ పద్దతిలో అంటే చేతిని పట్టుకుని రాయించే పద్ధతిలో వారికీ విద్యను అందిస్తేనే బాగుంటుంది అనుకున్నారు. 2016లో అతని బృందం 'Annie' పై పని చేయడం ప్రారంభించారు. ఇది దృష్టి లోపం ఉన్న పిల్లల కోసం నేర్చుకోవడం మరింత ఆసక్తికరంగా చేస్తుంది. ఈ పరికరం బ్రెయిలీకి ఒక ఎంబోస్డ్ రీడింగ్ సిస్టమ్‌ను నేర్పుతుంది. దీనితో దృష్టి లోపం ఉన్న విద్యార్థులు తమ వేళ్లతో ఇంగ్లీష్, హిందీ లేదా వారు సౌకర్యవంతంగా ఉన్న ఏ స్థానిక భాషలో అయినా చదవడానికి వీలు కల్పిస్తుంది. భాషకు సంబంధించిన అన్ని ప్రాథమిక అంశాలను నేర్చుకుని అక్షరాస్యులు అవుతారు. ఆ జ్ఞానాన్ని పదజాలం, వాక్యాలు మొదలైన ఇతర విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.