
ఈ సామ్ సంగ్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ లో 75% తగ్గింపు, త్వరపడండి
ఈ వార్తాకథనం ఏంటి
సామ్ సంగ్ Galaxy Buds Live ఇప్పుడు అతి తక్కువ ధరకు అంటే కేవలం రూ. 3,999 అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆరు గంటల సేపు యాక్టివ్ గా ఉంటాయి. దీనికి ఛార్జింగ్ కేస్ 472mAh బ్యాటరీ ఉంటుంది, ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.
Galaxy Buds Live భారతదేశంలో రూ. 14,990. అయితే, ఈ ఆఫర్ ద్వారా కేవలం రూ. 3,999కే, అంటే రూ. 10,991 తగ్గింపుతో లభిస్తుంది. అమెజాన్ ఈ ప్రాడక్ట్ పై ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ ను కూడా అందిస్తోంది.
అమెజాన్
అమెజాన్‌లో ఇవి మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి
Galaxy Buds Live ఇయర్‌బడ్‌లు ట్యాప్ కంట్రోల్‌లతో బీన్ ఆకారంలో, నిగనిగలాడే డిజైన్ తో ఉంటాయి. అమెజాన్‌లో ఇవి మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ రెడ్ మరియు మిస్టిక్ బ్రాంజ్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఇయర్‌బడ్ బరువు 5.6గ్రా. రిటైల్ బాక్స్‌లో USB కేబుల్ తో పాటు చిన్న, పెద్ద ఇయర్ టిప్స్ కూడా ఉంటాయి.
ఇయర్‌బడ్స్‌లో మూడు మైక్రోఫోన్‌లు ఉన్నాయి, దానితో పాటు పంచ్ సౌండ్ కోసం ప్రత్యేకమైన బాస్ డక్ట్ ఉంటుంది.ఇది Bixby వాయిస్ వేక్-అప్ ఫీచర్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వినియోగదారులు అనేక ఫంక్షన్‌లను హ్యాండ్స్-ఫ్రీగా చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఆడియో స్ట్రీమింగ్ యాప్‌ల ట్యాప్ ప్లేబ్యాక్ కూడా అందుబాటులో ఉంది.