Page Loader
ఇండియాలో ఈ బస్సు వెరీ స్పెషల్
మహరాష్ట్రలో అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు

ఇండియాలో ఈ బస్సు వెరీ స్పెషల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2023
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

మార్కెట్ లోకి ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్‌తో బస్సులు వస్తుంటాయి. టెక్నాలజీ పెరిగే కొద్ది వాటి రూపురేఖలు మారుతుంటాయి. మనం ఇప్పటివరకూ ఎలక్ట్రిక్ బైకులు, కార్లు, బస్సులను చూశాం. కానీ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సు మాత్రం చూడలేదు. అయితే మహారాష్ట్రలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సును జనవరి 13న ప్రారంభించారు. ఈ బస్సుకి 73 సీట్లు ఉంటాయి. ఇది కుర్లా బస్ డిపో-బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య నడుస్తోంది. ఇంకా ఇలాంటి 200 బస్సులను ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తేస్తామని బెస్ట్ జనరల్ మేనేజర్ చెప్పారు.

బస్సు

ఈ డబుల్ డెక్కర్ బస్సు ధర రూ.2 కోట్లు

ఈ బస్సులను స్విచ్ EiV 22 అని పిలుస్తారు. దీన్ని స్విచ్ మొబిలిటి సంస్థ తయారు చేసింది. ఇది దేశంలో గుర్తింపు పొందిన బ్రాండ్ ఆశోక్ లేలాండ్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అనుబంద సంస్థది. దీని ధర దాదాపు రూ.2కోట్లు ఉండనుంది. స్విచ్ EiV 22 అనేది ప్రపంచంలోని మొట్టమొదటి సెమీ-లో ఫ్లోర్, ఎయిర్ కండిషన్డ్, ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు చెప్పొచ్చు. భవిష్యతులో పెద్ద పెద్ద నగరాల్లో ఈ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టే అవకాశం ఉండనుంది. వీటిని పూర్తిగా అందుబాటులోకి తెచ్చేకి ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుందో వేచి చూడాల్సిందే.