ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం
ఆలయ సేవల దుర్వినియోగాన్ని నివారించడానికి,తిరుమలలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ సేవను మేనేజింగ్ ట్రస్ట్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇది ప్రాంగణంలోని ప్రవేశ సమయంలో ఉన్న భక్తులందరినీ గుర్తిస్తుంది. ఇక్కడి అధికారులు 3,000 కెమెరాల ద్వారా యాత్రికులపై నిఘా ఉంచనున్నారు. తిరుమలను ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. అందుకని, ప్రాంగణంలో ఉన్న ప్రతి వ్యక్తిని ట్రాక్ చేయడం కష్టం అవుతుంది. టీటీడీ ప్రవేశపెట్టిన కొత్త ఫేషియల్ రికగ్నిషన్ టెక్ దీనికి తోడ్పడనుంది. తప్పిపోయిన వ్యక్తులను కనుగొనడం, దొంగతనాలు నిరోధించడానికి ఇది సహాయపడుతుంది.
రానున్న రోజుల్లో ఇతర సేవలకు వర్తింపు
సర్వదర్శనం (ఉచిత దర్శనం), లడ్డూ వితరణ కౌంటర్లు, టోకెన్‌లెస్ దర్శనం (పవిత్ర సందర్శన), కాషన్ డిపాజిట్ రీఫండ్‌ల విభాగం, వసతి కేటాయింపు వ్యవస్థలలో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని మొదట ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో ఇతర సేవలకు కూడా విస్తరింపజేయనున్నారు. భక్తులు తరచుగా సర్వదర్శనం కాంప్లెక్స్‌లో టోకెన్‌లను పట్టుకుని, రీఫండ్ కౌంటర్‌ల నుండి అదనపు కాషన్ డిపాజిట్‌లను డ్రా చేయడానికి వాటిని ఉపయోగిస్తారు. ఉచిత దర్శనం కోసం అనేకసార్లు రావడం వల్ల ఆలయం ఎప్పుడూ కిక్కిరిసి ఉండటంతో ఇతర యాత్రికులు అసౌకర్యానికి గురవుతున్నారు. నమోదు సమయంలో భక్తులు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న చిత్రం డేటా బ్యాంక్‌లో స్టోర్ అవుతుంది.అదే వ్యక్తి రెండోసారి విజిట్‌కు వస్తే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అలర్ట్ చేస్తుంది.