Page Loader
ISRO SpaDeX: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, SpaDeX ప్రయోగం 2 నిమిషాలకు వాయిదా: ఇస్రో
అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, SpaDeX ప్రయోగం 2 నిమిషాలకు వాయిదా: ఇస్రో

ISRO SpaDeX: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, SpaDeX ప్రయోగం 2 నిమిషాలకు వాయిదా: ఇస్రో

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2024
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది చేపట్టిన చివరి ప్రయోగం వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై ఇస్రో చైర్మన్ ఎస్. సోమ్‌నాథ్ స్పందించారు. స్పేడెక్స్‌ ప్రయోగం ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తూ, అంతరిక్షంలో ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా అనుకున్న సమయానికి ప్రయోగం జరగలేదని తెలిపారు. రాకెట్‌ వెళ్లాల్సిన కక్ష్యలో ఇతర ఉపగ్రహాలు అనుసంధానం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల ప్రయోగాన్ని రెండు నిమిషాలు ఆలస్యం చేసి, 9.58 గంటలకు జరగాల్సిన ప్రయోగాన్ని 10 గంటల 15 సెకన్లకు రీషెడ్యూల్‌ చేసినట్లు వెల్లడించారు. ఇదే తొలిసారి కాకుండా, 2023లో చంద్రయాన్‌-3 మిషన్‌ కూడా ఇలా కొన్ని నిమిషాల పాటు వాయిదా పడింది.

వివరాలు 

స్పేడెక్స్‌ ప్రయోగం ద్వారా ఛేజర్‌,టార్గెట్‌ ఉపగ్రహాల ప్రవేశం 

ఇస్రో నిపుణులు గుర్తించిన ప్రకారం,స్టార్‌లింక్‌కు చెందిన కొన్నిఉపగ్రహాలు ప్రయోగానికి ఆటంకం కలిగించాయి. ప్రస్తుతానికి స్టార్‌లింక్‌ సముదాయానికి చెందిన 7,000ఉపగ్రహాలు భూమి కక్ష్యలో దిగువ భాగంలో ఉన్నాయని, ఇవి చాలా కాలంగా అంతరిక్షంలో ట్రాఫిక్‌ జామ్‌కు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా, అంతరిక్ష వ్యర్థాల కారణంగా ఉపగ్రహాలకు ప్రమాదం కలిగే అవకాశముందని కూడా హెచ్చరించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ సీ-60 నింగిలోకి దూసుకెళ్లనుంది. స్పేడెక్స్‌ ప్రయోగం ద్వారా ఛేజర్‌,టార్గెట్‌ ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది. ఈ రెండు ఉపగ్రహాల బరువు 440కిలోలు. ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైన తర్వాతే అంతరిక్షంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీని వల్ల ప్రయోగాన్ని రెండు నిమిషాలు ఆలస్యంగా రీషెడ్యూల్‌ చేయాల్సి వచ్చింది.