TRAI: కీలక ఆదేశాలిచ్చిన ట్రాయ్.. ఇకపై అలాంటి సందేశాలు పంపాలంటే యూజర్ అనుమతి తప్పనిసరి
లోన్లు, స్కీములు అంటూ వచ్చే సందేశాలకు ఇక చెక్ పడనుంది. వాటికి ముకుతాడు వేస్తూ ట్రాయ్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. చాలాసార్లు రెగ్యులర్ కాల్స్, మెసేజులు కంటే ప్రమోషనల్ కాల్స్, మెసేజులే ఎక్కువగా ఉంటాయి. ఒక్కో యూజర్ రోజుకు సగటున 12 మెసేజులను స్పామ్ సందేశాలను అందుకుంటున్నారని ఓ నివేదిక తెలిపింది. ఇలాంటి తరుణంలో ట్రాయ్(TRAI) కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇలాంటి మెసేజ్ లు పంపే యూజర్లు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలంటూ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రమోషనల్ సందేశాలను అరికట్టడానికి డిజిటల్‌గా అనుమతి పొందేందుకు డీసీఏ పేరిట ప్రోగ్రామ్‌ను ఇటీవల ట్రాయ్ తీసుకొచ్చింది.
నేటి నుంచే నిబంధనలు అమల్లోకి
మరోవైపు లోన్లు, స్కీములు అంటూ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రమోషనల్ సందేశాలు పంపించాలంటే తప్పకుండా యూజర్ అనుమతి తీసుకొనే చర్యలను చేపట్టనున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ యూజర్ కు ఏదైనా కంటెంట్ ను పంపించాలంటే ముందుగా టెలికా ఆపరేటర్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. తర్వాత టెలికా ఆపరేటర్ 127*** షార్ట్ కోడ్ తో కూడిన ఓ ఎస్సెమ్మెస్ ను పొందాల్సి ఉంటుంది. ఇక ఆ మెజేస్ కు యూజర్ అనుమతి ఇవ్వొచ్చు. లేదంటే నిరాకరించవచ్చు. ఒకవేళ యూజర్ నిరాకరిస్తే టెలికాం కంపెనీ సదరు ఏజెన్సీనికి ఆ యూజర్ కు ఇకపై సందేశాలు పంపకుండా నిలువరించాల్సి ఉంటుంది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు ట్రాయ్ స్పష్టం చేసింది.