LOADING...
National Space Day: చంద్రుడిపై త్రివర్ణ ముద్ర.. చంద్రయాన్-3తో భారత్ గ్లోబల్ పవర్!
చంద్రుడిపై త్రివర్ణ ముద్ర.. చంద్రయాన్-3తో భారత్ గ్లోబల్ పవర్!

National Space Day: చంద్రుడిపై త్రివర్ణ ముద్ర.. చంద్రయాన్-3తో భారత్ గ్లోబల్ పవర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

2023 ఆగస్టు 23న భారత్‌ చరిత్రలో తన పేరును లిఖించుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన 'చంద్రయాన్-3' మిషన్ చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇంతవరకు ఏ దేశం చేరని ఈ ప్రాంతాన్ని భారత్ తొలిసారిగా అందుకోవడంతో అంతరిక్ష రంగంలో భారత ప్రతిష్ఠ పెరిగింది. ఇంతకు ముందు అమెరికా, సోవియట్ యూనియన్, చైనా మాత్రమే చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండింగ్ సాధించగా, ఇప్పుడు భారత్ నాలుగో దేశంగా నిలిచింది. 2008లో చంద్రయాన్-1తో భారత్ చంద్రయాత్ర ప్రారంభించింది. అదే మొదటిసారి చంద్రుడిపై నీటి అణువులు ఉన్నట్లు కనుగొంది. 2019లో చంద్రయాన్-2లో ల్యాండర్ విఫలమైనప్పటికీ, ఆ ఆవేదన తర్వాతే చంద్రయాన్-3 రూపుదిద్దుకుంది.

Details

విజయ క్షణాలు ఇవే

ల్యాండర్ విక్రం, రోవర్ ప్రగ్యాన్‌తో కూడిన ఈ మిషన్ 615 కోట్లు ఖర్చుతో అత్యంత తక్కువ వ్యయంతో విజయవంతమైంది. ఆగస్టు 23న సాయంత్రం 6:04 గంటలకు విక్రం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవానికి సాఫీగా దిగగానే ఇస్రో కేంద్రంలో సంబరాలు ఊగిపోయాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అప్పట్లో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సులో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా లైవ్‌లో ఈ క్షణాన్ని వీక్షించి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

Details

శాస్త్రీయ ఫలితాలు

రోవర్ ప్రగ్యాన్ చంద్ర మట్టిలో ఇస్రో లోగో, జాతీయ చిహ్నాన్ని ముద్రించింది. లేజర్ స్పెక్ట్రోస్కోప్‌తో సల్ఫర్, అల్యూమినియం, కాల్షియం, ఇనుము వంటి మూలకాలను గుర్తించింది. సీస్మోమీటర్ చంద్రుని ప్రకంపనలు రికార్డ్ చేసింది. ఉష్ణోగ్రత సెన్సార్లు తీవ్రమైన తేడాలను నమోదు చేశాయి. చంద్రయాన్-3 విజయానికి ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యా రోస్కోస్మోస్ ఇస్రోను అభినందించాయి. చంద్రుడి నుంచి భూమి తొలి చిత్రం 1966 ఆగస్టు 23న నాసా లూనార్ ఆర్బిటర్-1 నుంచి భూమి తొలి ఫోటో పంపింది. చంద్రుడి పరిసరాలనుంచి తీసిన ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో మానవాళికి భూమి ఎంత చిన్నదో, ఎంత సున్నితమైనదో చూపించింది.