Page Loader
Twitter : స్తంభించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దిగ్గజం ట్విట్టర్ 
Twitter : స్తంభించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దిగ్గజం ట్విట్టర్

Twitter : స్తంభించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దిగ్గజం ట్విట్టర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 21, 2023
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X(ట్విట్టర్) స్థంభించిపోయింది. దింతో ప్రపంచవ్యాప్తంగా అందరి అకౌంట్లు బ్లాంక్ అయ్యాయి. సాధారణ యూజర్లతో పాటు ప్రీమియం,ప్రో అకౌంట్ హోల్డర్లకు కూడా ట్విట్టర్ సేవలు నిలిచిపోయినట్లు ప్రముఖ ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైటు downdetector.com తెలిపింది. ఈ సమస్య కేవలం ట్వీట్ల విజిబిలిటీని మాత్రమే ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది. ఎందుకంటే సమస్య వెలువడిన నిమిషాల వ్యవధిలోనే #TwitterDown వెబ్‌సైట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ట్వీట్లు ,పోస్టులు ఎవరికి కన్పించడం లేదు. అటు ఫాలోయింగ్‌, ఫర్‌ యూ, లిస్ట్‌ పేజీలు కూడా ఖాళీగానే కన్పిస్తున్నాయి. ఎక్స్‌ ప్రీమియం, ఎక్స్‌ ప్రో వెర్షన్‌లు కూడా పనిచేయడం లేదని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు.

Details 

గత రెండు నెలల్లో అనేకసార్లు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న X 

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని X గత రెండు నెలల్లో అనేకసార్లు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. డిసెంబర్ 14లో, X నుండి అన్ని అవుట్‌గోయింగ్ లింక్‌లు అకస్మాత్తుగా పని చేయడం ఆగిపోయాయి. జూలైలో, downdetector.com US, UKలో X 13,000 కంటే ఎక్కువ ఉదంతాలను నమోదు చేసింది. మార్చి 6న ప్లాట్‌ఫారమ్ కొన్ని గంటలపాటు ఆగిపోయింది. వినియోగదారులు లింక్‌లు, చిత్రాలు, వీడియోలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.