Page Loader
యూజర్లుకు ఝలక్ ఇచ్చిన ట్విట్టర్

యూజర్లుకు ఝలక్ ఇచ్చిన ట్విట్టర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 18, 2023
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్విట్టర్ మరోసారి యూజర్లకు ఝలక్ ఇచ్చింది. ఎస్ఎమ్ఎస్ ఆధారిత టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్(2ఎఫ్ఏ) భద్రతా సదుపాయాన్ని ఇకపై ట్విట్టర్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లే ఇస్తామంటూ శుక్రవారం వెల్లడించింది. త్వరలో ఈ విధానం అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూజర్లకు మరోమారు షాక్ తగిలినట్లు అయింది. మార్చి 20 తర్వాత ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే టెక్స్ట్ మెసేజ్‌లను ప్రమాణీకరణ పద్ధతిగా ఉపయోగించలరని కంపెనీ ట్విట్ చేసింది. భద్రత కల్పించేందుకు ట్విట్టర్ టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అమలు చేస్తోంది. ఇంకా ఆకౌంట్లోకి లాగిన్ అవ్వాలనుకుంటే పాస్ వర్డ్ తో పాటు ఎస్ఎమ్ఎస్, ఆథెంటికేషన్ యాప్ లేదా సెక్యూరిటీ పాస్‌వర్డ్ అవసరమ్యేలా దీన్ని రూపొందించారు.

ట్విట్టర్

ప్రతి ఏటా 60 మిలియన్ డాలర్లు నష్టం

ఎస్ఎమ్ఎస్ ఆధారిత ఆథెంటికేషన్‌ను బాట్ అకౌంట్లు దుర్వినియోగ పరుస్తాయని తాజాగా ట్విట్టర్ తన బ్లాగ్‌లో ఆరోపించింది. బాట్లతో 2 ఎఫ్ఏ పాస్‌వర్డులు వెల్లువత్తున్నాయని, ఫలితంగా సంస్థకు ఏటా 60 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లితోందని పేర్కొంది. రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు, జర్నలిస్టులు, ఇతర ప్రజాప్రతినిధుల ధృవీకరించబడిన ఖాతాలకు మాత్రమే బ్లూ టిక్ మార్క్ ఉండేది. ప్రస్తుతం ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారందరికి అందుబాటులోకి రానుంది.