Page Loader
ఎలన్ మస్క్‌కు షాక్.. కీలక ఎగ్జిక్యూటివ్‌ ఎల్లా ఇర్విన్ గుడ్‌ బై
ట్విట్టర్ కు గుడ్ బై చెప్పిన ఎల్లా ఇర్విన్

ఎలన్ మస్క్‌కు షాక్.. కీలక ఎగ్జిక్యూటివ్‌ ఎల్లా ఇర్విన్ గుడ్‌ బై

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 02, 2023
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్విట్టర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన ఉన్నతాధికారి ట్విట్టర్ సంస్థకు బైబై పలికింది. ఈ మేరకు సంస్థ ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ ఎల్లా ఇర్విన్ కంపెనీకి రాజీనామా సమర్పించారు. కంటెంట్ నియంత్రణ పర్యవేక్షణా అధికారి ఇర్విన్‌ ట్విట్టర్ నుంచి తప్పుకున్నారు. గురువారం రాయిటర్స్‌తో మాట్లాడిన ఎల్లా ఇర్విన్, మస్క్ అక్టోబర్‌లో హానికరమైన కంటెంట్‌ను కొనుగోలు చేశారని, అప్పట్నుంచి హానికరమైన కంటెంట్‌కు రక్షణ కల్పించడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో కంపెనీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ట్విట్టర్ ను టేకోవర్‌ చేసిన కష్టకాలంలో, ఆనాటి హెడ్ యోయెల్ రోత్ రాజీనామాతో జూన్ 2022లో ఇర్విన్‌ బాధ్యతలు స్వీకరించారు.

TWITTER AWAITED FOR ELON MUSK RESPONSEచేసినట్లు 

ఎలన్ మస్క్ స్పందన కోసమే ఎదురుచూపులు

ఒక వైపు విద్వేష పూరితమైన కంటెంట్‌, మరోవైపు ట్విట్టర్‌లో ప్రకటనదారులు ఒక్కొక్కరుగా తప్పుకోవడం లాంటి సంఘటన నడుమ ఇర్విన్ సైతం అదే బాటలో వైదొలగడం బాస్ మస్క్‌కు గుదిబండగా మారింది. దీనిపై మస్క్‌ స్పందన కోసం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గతేడాది జూన్ లో ఇర్విన్ ట్విట్టర్‌లో చేరారు. అదే ఏడాది నవంబర్‌లో అప్పటి హెడ్, యోయెల్ రోత్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. దీంతో ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఇర్విన్, కంటెంట్ నియంత్రణను పర్యవేక్షించేది. ఇర్విన్ బాధ్యతలు స్వీకరించిన కొత్తలో ఖర్చు తగ్గించుకునేందుకు ట్విటర్‌కు చెందిన 3,700 మంది ఉద్యోగులపై మస్క్‌ వేటు వేశారు. తాజాగా ఆమె రాజీనామా అంశం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రెకెత్తిస్తుండటం కొసమెరుపు.