రెడ్ మీ నుంచి తక్కువ బడ్జెట్ లో రెండు ఫోన్లు.. ఏ2, ఏ2+ ఫోన్లపై రెండేళ్ల వారంటీ
చైనా టెక్నాలజీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ భారత మార్కెట్లోకి రెండు ఫోన్లను శుక్రవారం ప్రవేశపెట్టింది. అత్యంత చౌక ధరకు రెడ్ మీ ఏ2, రెడ్ మీ ఏ2+ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్స్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేయనున్నాయి. ముఖ్యంగా వీటిలో కృత్రిమ మేథ ఆధారిత కెమెరా సిస్టమ్ ఉండడం గమనార్హం. ఈ రెండు మోడల్ ఫోన్లలోనూ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఉండనుంది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో ఈ ఫోన్స్ రానున్నాయి. రెడ్‌మీ ఏ2 సిరీస్ ఫోన్లలో 6.52-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్, 8-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ ఉండనుంది.
ఫోన్ల ధరపై ఓ లుక్కేయండి
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ తో వచ్చే రెడ్ మి ఏ2 బేస్ వేరియంట్ ధర రూ. 5,999, 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో వచ్చే రెడ్ మి ఏ2 వేరియంట్ రూ. 6,499 లకు లభిస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో వచ్చే రెడ్ మి ఏ2 ధర రూ. 7,499, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో వచ్చే రెడ్ మి ఏ 2 ప్లస్ ధర రూ. 8,499 గా నిర్ణయించారు. అమెజాన్ స్టోర్లో మే23 నుంచి కొనుగోలు చేయనుంది. ఐసీఐసీఐ కార్డ్స్ తో కొనుగోలు చేస్తే రూ.500 వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది.