Page Loader
IRCTC Down: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మళ్లీ డౌన్, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మళ్లీ డౌన్, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు

IRCTC Down: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మళ్లీ డౌన్, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2024
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఈ ఉదయం మళ్లీ డౌన్ అయింది.ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే,తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే ఈ సైట్ డౌన్ అయింది. ప్రస్తుతం వెబ్‌సైట్ పై నిర్వహణ పనులు జరుగుతున్నాయని ఒక సందేశం చూపిస్తోంది.అందువల్ల, ఈరోజున 1 గంటపాటు బుకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఈనెలలో ఇది మూడోసారి IRCTC వెబ్‌సైట్ డౌన్ కావడం.డిసెంబర్ 9,2024న కూడా ఈ సైట్ రెండు గంటల పాటు పనిచేయలేదు, దీనివల్ల ప్రయాణికులకు టికెట్ బుకింగ్ లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. నేడు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు తమ ట్రిప్పుల్ని ప్లాన్ చేసుకుంటున్నాటికెట్ బుకింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. రైల్వే శాఖ నుండి ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.అలాగే గతంలో కూడా ఎలాంటి సమాధానాలు రాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ డౌన్.. కస్టమర్ ట్వీట్