వాట్సాప్ లో త్వరలో స్టేటస్ రిపోర్ట్ చేసే ఆప్షన్
వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది, దీని ద్వారా వినియోగదారులు వెబ్‌లో స్టేటస్ అప్డేట్స్ రిపోర్ట్ చేయచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇప్పటికే బీటా వినియోగదారులకు అందుబాటులో ఉంది, త్వరలో ఇతర వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. వినియోగదారులు స్టేటస్ విభాగంలో కొత్త మెనుకి వెళ్లడం ద్వారా వారి స్టేటస్ రిపోర్ట్ చేయగలరు. ప్రతి ఇతర ఫీచర్‌లాగే, ప్లాట్‌ఫారమ్ నిబంధనలు,షరతులను ఉల్లంఘించే ఏదైనా హానికరమైన, అనుమానాస్పద, తప్పుదారి పట్టించే వినియోగదారుల స్టేటస్ ను రిపోర్ట్ చేయచ్చు, అప్పుడు పరిశీలన కోసం వాట్సాప్ పాలసీ బృందానికి పంపబడుతుంది. ఒకవేళ ఉల్లంఘించినట్లు తేలితే చర్య తీసుకుంటారు. అయితే ఈ ఫీచర్ వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానాన్ని ఉల్లంఘించదు.
సరికొత్త ఎమోజీని త్వరలో విడుదల చేయనున్న వాట్సాప్
ఇటీవల, వాట్సాప్ తన రెండు బిలియన్ల వినియోగదారుల కోసం అనేక కొత్త ఫీచర్లను విడుదల చేసింది. ఇందులో కాల్ లింక్‌లు, అవతార్‌లు, కమ్యూనిటీలు, ఇన్-చాట్ పోల్స్, పెద్ద గ్రూప్‌లు, గ్రూప్ కాల్‌లలో ఎక్కువ మంది వినియోగదారులు, మెసేజ్‌లకు ప్రతిస్పందనలు వంటివి ఉన్నాయి. కొత్త అన్‌డూ డిలీట్ ఫీచర్‌ను ప్రకటించడం ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి వినియోగదారులని రక్షిస్తుంది. ఈ ఫీచర్ 5 సెకన్లలోపు డిలీట్ మెసేజ్‌ను అన్‌డూ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అదనంగా, ప్లాట్‌ఫారమ్ కొత్త లార్జ్ హార్ట్ ఎమోజీపై పని చేస్తోంది. ఫీచర్ బీటా టెస్టింగ్ దశలో ఉన్నందున వినియోగదారులు త్వరలో తమ ప్రియమైన వారికి ఈ పెద్ద ఎమోజీని పంచుకోవచ్చు.