LOADING...
Vikram-1 rocket: శ్రీహరికోటకు బయలుదేరిన విక్రమ్-1 రాకెట్.. జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
శ్రీహరికోటకు బయలుదేరిన విక్రమ్-1 రాకెట్.. జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

Vikram-1 rocket: శ్రీహరికోటకు బయలుదేరిన విక్రమ్-1 రాకెట్.. జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 25, 2026
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ వేదికగా దేశంలోని తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయాణానికి కీలక అడుగు పడింది. ఈ కార్యక్రమం మ్యాక్స్-క్యూ క్యాంపస్‌లో ప్రత్యేకంగా నిర్వహించగా, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీహరికోటకు తరలించనున్న విక్రమ్-1 రాకెట్‌ను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.

వివరాలు

అంతరిక్ష రంగంలో కీలక మైలురాయి

అంతరిక్ష ప్రయోగానికి ముందు నిర్వహించే ప్రీ-ఫ్లైట్ పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తి కావడంతో, తదుపరి దశ ప్రయోగం కోసం రాకెట్‌ను సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్కు తరలించనున్నారు. దేశ ప్రైవేటు అంతరిక్ష రంగంలో ఇది ఒక కీలక మైలురాయిగా భావించబడుతోంది. విక్రమ్-1 ప్రయోగంతో భారతదేశం ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ రంగంలో కొత్త దశలోకి అడుగుపెడుతోంది.

Advertisement