
Vivo T4 5G : మార్కెట్‌లో వివో T4 5G సంచలనం.. రూ.22 వేలకే హైరేంజ్ ఫీచర్లు?
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త 5G ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా?అయితే మీ కోసం గుడ్ న్యూస్. వివో సంస్థ భారత మార్కెట్లోకి వివో T4 5G ఫోన్‌ను విడుదల చేసింది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉంది.
ఇందులో క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, IP65 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ వంటి ప్రీమియం లక్షణాలు ఉన్నాయి.
వివో T4 5G ఫోన్‌లో 7,300mAhభారీ బ్యాటరీ ఉంటుంది. ఇది90Wఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఫోన్‌లో 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్ వినియోగించారు. ఇది 12GB వరకు LPDDR4X RAM, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.
Details
డిస్‌ప్లే, డిజైన్
6.77 అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఫాంటమ్ గ్రే, ఎమరాల్డ్ బ్లేజ్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.
కెమెరా సెటప్
వివో T4 5G ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ లెన్స్‌లతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించారు.
సాఫ్ట్‌వేర్
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత FunTouch OS 15పై రన్ అవుతుంది.
Details
ధరలు, వేరియంట్లు
8GB + 128GB - రూ. 21,999
8GB + 256GB - రూ.23,999
12GB + 256GB - రూ. 25,999
ఫోన్ ఏప్రిల్ 29 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
లభ్యమయ్యే ఆఫర్లు
HDFC, SBI, Axis బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్
వివో యూజర్లకు రూ.2,000 ఎక్స్చేంజ్ బోనస్
6 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్లు
ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక వెబ్‌సైట్, మరియు ఇతర రిటైల్ చానెళ్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.