Page Loader
Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం! 
వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!

Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

వివో మళ్లీ టెక్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమైంది. గతేడాది విడుదలైన Vivo T3 Ultraకి కొనసాగింపుగా, తాజాగా 'Vivo T4 Ultra' భారత మార్కెట్‌లోకి రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్లను ఇప్పటికే కంపెనీ విడుదల చేసింది. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్-లెవల్ జూమ్ ఫీచర్‌ను హైలైట్ చేస్తూ మార్కెటింగ్ ప్రారంభించింది. టీజర్ ప్రకారం, Vivo T4 Ultra ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇందులో ప్రత్యేకంగా పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండే అవకాశం ఉంది, ఇది 100x డిజిటల్ జూమ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే రింగ్ ఆకారంలో ఉండే LED ఫ్లాష్ టీజర్‌లో స్పష్టంగా కనిపించింది.

Details

50MP పెరిస్కోప్ జూమ్ కెమెరా ఏర్పాటు

గతంలో వచ్చిన Vivo T3 Ultra మోడల్‌కి Dimensity 9200+ ప్రాసెసర్ ఉన్నా, కెమెరా విభాగంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇది కేవలం 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో మాత్రమే వచ్చింది. అయితే T4 Ultra మోడల్‌లో కెమెరా సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచారు. నూతనంగా వస్తున్న Vivo T4 Ultraలో 6.67-ఇంచుల pOLED డిస్‌ప్లే ఉండనుందని, దీని రిఫ్రెష్‌రేట్ 120Hzగా ఉండబోతోందని సమాచారం. ఈ ఫోన్‌లో శక్తివంతమైన MediaTek Dimensity 9300 సిరీస్ ప్రాసెసర్ ఉపయోగించనున్నారు. కెమెరా విభాగంలో 50MP Sony IMX921 ప్రైమరీ కెమెరాతో పాటు, 50MP పెరిస్కోప్ జూమ్ కెమెరాను కూడా చేర్చనున్నారు.

Details

ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ లో లభ్యం

అలాగే 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో లభించనుంది. ఇంకా సెల్ఫీ కెమెరా, బ్యాటరీ సామర్థ్యం వంటి ఇతర ఫీచర్ల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ ఫోన్ జూన్ మొదటి వారంలో భారత మార్కెట్‌లో విడుదల కానుందని సమాచారం. విడుదలైన తర్వాత ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. వివో తన T సిరీస్‌ను కెమెరా, పెర్ఫార్మెన్స్ పరంగా అధునాతనంగా తీర్చిదిద్దుతూ తీసుకొస్తుండటం వినియోగదారులకు కొత్త అనుభూతినిస్తుంది. ఇప్పుడు Vivo T4 Ultra తన ఫ్లాగ్‌షిప్ లెవల్ ఫీచర్లతో మిడ్‌రేంజ్ మార్కెట్‌ను ఆకర్షించగలదా అనేది ఆసక్తిగా ఎదురుచూడాల్సిన అంశం.