
Vivo: వాటర్‌ప్రూఫ్ ఫోన్ కావాలా.. 50ఎంపీ కెమెరాలతో వివో సరికొత్త ఎక్స్200 ఎఫ్‌ఈ వచ్చేస్తోంది!
ఈ వార్తాకథనం ఏంటి
వివో కంపెనీ తన తాజా టెక్నాలజీతో రూపొందించిన రెండు ప్రీమియం ఫోన్లను జూలై 14న, సోమవారం భారతదేశంలో విడుదల చేయనున్నది. వీటిలో ఒకటి ఫోల్డబుల్ ఫోన్ అయిన ఎక్స్ ఫోల్డ్ 5 కాగా, మరొకటి ఫ్లాట్ డిజైన్‌తో రాబోతున్న ఎక్స్200 ఎఫ్‌ఈ మోడల్. ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో శాంసంగ్, మోటరోలా లాంటి దిగ్గజాలకు ఎఫ్ ఫోల్డ్ 5 పోటీ ఇవ్వనుండగా, ఎక్స్200 ఎఫ్‌ఈ మాత్రం ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ 13ఎస్‌కు గట్టి సవాల్ విసరనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లభించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Details
వివో ఎక్స్200 ఎఫ్‌ఈ - ముఖ్యమైన ఫీచర్లు
డిస్‌ప్లే ఈ డివైస్‌లో 6.31 అంగుళాల స్క్రీన్‌ను అందించనున్నారు. మందం పరంగా ఇది 8 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండనుంది. కెమెరా సెటప్ ఫోన్‌లో రెండు 50 మెగాపిక్సెల్ జైస్ బ్రాండెడ్ లెన్స్‌లు, అదనంగా 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. అయితే వీటిలో ఉపయోగించిన సెన్సార్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. బ్యాటరీ చిన్న డిజైన్ ఉన్నప్పటికీ, 6500ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తోంది. ఇది 90 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను మద్దతు ఇస్తుంది. వాటర్/డస్ట్ రెసిస్టెన్స్ IP68, IP69 రేటింగ్‌లతో వస్తోంది. దీన్ని 1.5 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాల పాటు ఉంచవచ్చు. ఏ దిశ నుంచి అయినా నీటి జెట్‌లు తట్టుకోగలదు.
Details
ప్రాసెసర్
మెడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇప్పటికే వివో టీ4 అల్ట్రా ఫోన్‌లో ఉపయోగించారు. సాఫ్ట్‌వేర్ యూఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15 మీద నడుస్తుంది. కలర్ వేరియంట్లు: బ్లూ బ్రీజ్, యెల్లో గ్లో, పింక్ వైబ్, బ్లాక్ లక్స్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వివో ఎక్స్ ఫోల్డ్ 5 - అంచనా స్పెసిఫికేషన్లు ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించిన భారతీయ వెర్షన్ స్పెసిఫికేషన్లు అధికారికంగా వెల్లడించనిప్పటికీ, చైనాలో విడుదలైన వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని అంచనా వివరాలు ఇవే:
Details
డిస్‌ప్లే
8.03 అంగుళాల 2K+ 8టీ ఎల్‌టీపీఓ అమోలెడ్ మెయిన్ డిస్‌ప్లే 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కవర్ డిస్‌ప్లే రెండింటికీ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ప్రాసెసర్ & జీపీయూ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ అడ్రినో 750 GPU RAM & స్టోరేజ్ 16జీబీ వరకు LPDDR5X RAM 1TB వరకు UFS 4.0 స్టోరేజ్ సాఫ్ట్‌వేర్ చైనాలో ఆరిజిన్‌ఓఎస్ 5పై పనిచేస్తుండగా, భారత మార్కెట్‌లో ఫన్‌టచ్ ఓఎస్ 15 ఆధారిత ఆండ్రాయిడ్ 15 మీద నడవనుంది
Details
కెమెరా సెటప్
50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా (OISతో) 50MP శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్ లెన్స్ 50MP సోనీ IMX882 3X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (జైస్ బ్రాండింగ్‌తో) 20MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా సెక్యూరిటీ & ప్రొటెక్షన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ IPX9+ రేటింగ్ - వేడి నీటి జెట్‌లకు నిరోధకత బ్యాటరీ 6,000ఎంఏహెచ్ బ్యాటరీ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 40W వైర్‌లెస్ ఛార్జింగ్ వివో సంస్థ రెండు విభిన్న విభాగాల్లో పోటీకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఒకవైపు ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ ఫోన్.. మరొకవైపు పెర్ఫార్మెన్స్-ఫోకస్‌డ్ ఫ్లాట్ మోడల్. ఈ రెండింటి ధరలు, కొనుగోలు ఆఫర్లు లాంచ్ ఈవెంట్ రోజున వెల్లడయ్యే అవకాశముంది