Loading...
Water Droplets in Space: అంతరిక్షంలో నీటి బిందువుల వింత ప్రయాణం.... వీడియో వైరల్
అంతరిక్షంలో నీటి బిందువుల వింత ప్రయాణం.... వీడియో వైరల్

Water Droplets in Space: అంతరిక్షంలో నీటి బిందువుల వింత ప్రయాణం.... వీడియో వైరల్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 23, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్షంలో నీటి బిందువులు ఎలా కదులుతాయి? భూమిపై చూస్తే కిందకు జారిపడే నీటి బిందువులు, మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో మాత్రం ఊహించని విధంగా కదలగలవు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రయోగాన్ని వ్యోమగామి డాన్ పెటిట్ చూపించారు. టెఫ్లాన్‌తో తయారు చేసిన అల్లిక సూది చుట్టూ విద్యుత్‌ ఛార్జ్‌ ఉన్న నీటి బిందువులు వలయాకారంలో తిరుగుతున్న వీడియోను ఆయన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ Xలో పంచుకున్నారు. వీడియోలో కనిపించిన ఈ దృశ్యం అంతరిక్షంలో భౌతిక శాస్త్రం ఎలా భిన్నంగా పనిచేస్తుందో కళ్లకు కట్టినట్లు చూపించింది.

Details

సూది చుట్టూ ఎందుకిలా తిరిగాయి?

వీడియోను పై నుంచి చూస్తే కొన్ని నీటి బిందువులు అల్లిక సూది చుట్టూ తిరుగుతూ కనిపిస్తాయి.

సాధారణంగా నీటిని గాల్లో వదిలితే అది గురుత్వాకర్షణ కారణంగా కిందకు పడుతుంది.

కానీ అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో ఆ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.

ఈ ప్రయోగంలో నీటి బిందువులకు విద్యుత్‌ ఛార్జ్‌ ఉండటంతో, సూది చుట్టూ పనిచేసే ఎలక్ట్రోస్టాటిక్‌ బలాలు వాటి కదలికను ప్రభావితం చేశాయి.

ఫలితంగా బిందువులు కిందకు పడకుండా ఒక నిర్దిష్ట మార్గంలో తిరుగుతూ కనిపించాయి.

Details

మైక్రోగ్రావిటీ వల్లే ఈ మార్పు

డాన్ పెటిట్ వివరించిన ప్రకారం, ఈ కదలిక పూర్తిగా స్థిరమైన కక్ష్య కాదు.

ఎలక్ట్రోస్టాటిక్‌ బలాల కారణంగా ఏర్పడే సెమీ-స్టేబుల్‌ ఆర్బిటల్‌ మోషన్‌ ఇది. అంటే నీటి బిందువులు కొంతసేపు ఒకే తరహా మార్గంలో తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది.

భూమిపై గురుత్వాకర్షణ ప్రధాన పాత్ర పోషిస్తే, అంతరిక్షంలో అలాంటి ప్రభావం తగ్గిపోవడంతో ఇతర భౌతిక బలాలను స్పష్టంగా గమనించే అవకాశం లభిస్తుంది.

ADVERTISEMENT

Details

చిన్న ప్రయోగం.. పెద్ద సైన్స్‌ పాఠం

చూస్తే ఇది కేవలం సూది చుట్టూ తిరుగుతున్న కొన్ని నీటి బిందువుల్లా అనిపిస్తుంది.

కానీ దీని వెనుక ఉన్న శాస్త్రం మాత్రం ఆసక్తికరమైనది. మైక్రోగ్రావిటీలో ద్రవాలు ఎలా ప్రవర్తిస్తాయి, విద్యుత్‌ బలాలు వాటి కదలికను ఎలా మార్చగలవు అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఇలాంటి ప్రయోగాలు ఉపయోగపడతాయి.

అందుకే డాన్ పెటిట్‌ పంచుకున్న ఈ చిన్న వీడియో ఇప్పుడు అంతరిక్షంలో ద్రవాల ప్రవర్తనపై మరోసారి ఆసక్తిని పెంచుతోంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అంతరిక్షంలో నీటిబిందువుల విన్యాసం

ADVERTISEMENT