
WhatsApp: వాట్సాప్‌లో బిజినెస్ ప్రమోషనల్ మెసేజెస్ ఆపడానికి సులభ మార్గమిదే?
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ 'వాట్సాప్'కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. ఈ యాప్ కాల్స్, మెసేజింగ్, ఆడియో, వీడియో రికార్డింగ్ వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది. అయితే ఇటీవల బ్యాంకింగ్ రంగం, వ్యాపార సంస్థలు వాట్సాప్‌ను తమ ప్రమోషనల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్నాయి. వారు యూజర్లకు ఆఫర్లు, సేవలు, డిస్కౌంట్లు ఇతర ప్రకటనలతో సంబంధించి సందేశాలు పంపుతున్నారు. ఈ రకాల పదే పదే వచ్చే WhatsApp సందేశాలు చాలా మందికి చిరాకు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆఫీస్ వర్క్ లేదా బిజీ టైమ్‌లో ఈ సందేశాలు అంతరాయం సృష్టిస్తాయి. అయితే, ఇలాంటి ప్రమోషనల్ సందేశాలను సులభంగా ఆపవచ్చు. ఉదాహరణకు, మీరు XYZ కంపెనీ నుండి ఆటోమేటెడ్ WhatsApp సందేశాలు అందుకుంటున్నారని అనుకుందాం.
Details
చాట్ ను బ్లాక్ చేసే అవకాశం
ఈ సందేశాలు వ్యక్తి చేత కాకుండా, కంప్యూటర్ ద్వారా ఆటోమేటెడ్‌గా పంపబడతాయి. ఇలాంటి సందేశాలను ఆపడానికి, ఆ కంపెనీ చాట్ రూమ్‌లోకి వెళ్లిSTOP అని సందేశం పంపాలి. అలా చేస్తే, ఆ ప్రసార సందేశాలు ఆగిపోతాయి. కొన్ని సందర్భాల్లోSTOP పంపించిన తర్వాత కూడా కొన్ని చాట్‌లు పూర్తి గా నిలిచే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఆ చాట్‌ను బ్లాక్ చేయవచ్చు. బ్లాక్ చేసిన తర్వాత ఆ ఛానెల్ నుండి మీరు ఇకపై ఏ విధమైన ప్రమోషనల్ మెసేజులు అందుకోరు. వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌ను సకాలంలో అప్‌డేట్ చేస్తుంది. ఇటీవల కంపెనీ కొత్త ఫీచర్లను జోడించింది, వీటిలో లైవ్ ఫీచర్లు, మోషన్ ఫోటోలు, కొత్త చాట్ థీమ్‌లు,AI బ్యాంక్ గ్రౌండ్ ఫీచర్లు ఉన్నాయి.