UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం
జాతీయ సరిహద్దుల వెలుపల ఉన్న ప్రపంచ మహాసముద్రాలలో సముద్ర జీవులను రక్షించడానికి UN సభ్యులు మొట్టమొదటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2030 నాటికి ప్రపంచంలోని 30% మహాసముద్రాలను రక్షిత ప్రాంతాలుగా గుర్తించాలనే లక్ష్యంతో UN హై సీస్ ట్రీటీలో 200 కంటే ఎక్కువ దేశాలు పాల్గొన్నాయి. పర్యావరణవేత్తల ప్రకారం, కొత్త ఒప్పందం జీవవైవిధ్య నష్టాలను తగ్గిస్తుంది, స్థిరమైన అభివృద్ధిని చేయడంలో సహాయపడుతుంది. మహా సముద్రాలను నియంత్రించే నియమాలు ఉన్నప్పటికీ, ఆ నిబంధనలు తగినంతగా పర్యవేక్షించేవారు లేరు. UN హై సీస్ ట్రీటీ మార్చి 4న న్యూయార్క్‌లోని UN ప్రధాన కార్యాలయంలో ఒప్పందం జరిగింది. సముద్ర రక్షణపై చివరి అంతర్జాతీయ ఒప్పందం సముద్ర చట్టంపై UN కన్వెన్షన్, దాదాపు 40 సంవత్సరాల క్రితం 1982లో జరిగింది.
దాదాపు 10% సముద్ర జీవజాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి
ఉపరితల వైశాల్యం ప్రకారం ప్రపంచ మహాసముద్రాలు 60% కంటే ఎక్కువ ఉన్నాయి. అయితే, ఈ జలాల్లో కేవలం 1.2% మాత్రమే రక్షించబడుతున్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) అంచనా ప్రకారం, దాదాపు 10% జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. UN హై సీస్ ట్రీటీ 2030 నాటికి ప్రపంచంలోని 30% అంతర్జాతీయ జలాలను సముద్ర రక్షిత ప్రాంతాలలో (MPAs) ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతాలలో అనుమతించబడిన ఫిషింగ్ స్థాయి, షిప్పింగ్ లేన్‌ల మార్గాలు, లోతైన సముద్రపు మైనింగ్ వంటి కార్యకలాపాలపై పరిమితులు విధిస్తారు. యూరోపియన్ యూనియన్ (EU) అంతర్జాతీయ సముద్ర రక్షణ కోసం దాదాపు €820 మిలియన్లను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది.