ట్విట్టర్ కు పోటీగా మాజీ సిఈఓ జాక్ డోర్సే లాంచ్ చేయనున్న బ్లూస్కై
ఈ వార్తాకథనం ఏంటి
ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మాజీ CEO జాక్ డోర్సే రూపొందించిన బ్లూస్కీ పబ్లిక్ లాంచ్‌కు చేరువలో ఉంది. ఆపిల్ స్టోర్ లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ ఎలోన్ మస్క్ అధీనంలోకి రావడంతో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ చాలా ఒడిదుడుకులకు లోనైంది. అది ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ఉండే యాప్‌లకు మరిన్ని అవకాశాలు సృష్టించింది.
Mastodon, Tumblr వంటి యాప్‌లు మస్క్ కొనుగోలు చేసిన మొదటి రెండు నెలల్లో వృద్ధి చెందాయి. బ్లూస్కై ప్రాజెక్టు 2019లో ప్రారంభమైంది. ఇది డోర్సే సిఈఓగా ఉన్నప్పుడు ట్విట్టర్‌లో భాగంగా ఉండేది. అప్పుడు ట్విట్టర్ మాజీ సిఈఓ పరాగ్ అగర్వాల్ బ్లూస్కైకు మేనేజర్‌గా ఉన్నారు. ట్విటర్ ప్రారంభ రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌కు ఆర్థిక సహాయం చేసింది.
ట్విట్టర్
బ్లూస్కై ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ హవా తగ్గించే అవకాశం ఉంది
బ్లూస్కై, మాస్టోడాన్ అనే మరో ట్విట్టర్ ప్రత్యర్ధి లాగా కాకుండా విభిన్నంగా ఉంటుంది.
బ్లూస్కై వంటి ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల హవా తగ్గించే అవకాశం ఉంది. బ్లూస్కై యాప్ ట్విట్టర్‌తో సమానమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఇంకా బీటాగా మాత్రమే ఆపిల్ స్టోర్ లో అందుబాటులో ఉంది, ఇంకా ప్రాజెక్ట్ పరిశోధనలోనే ఉంది. అయితే కొన్ని ఫీచర్లు ట్విట్టర్ లాగా ఉంటాయి. భవిష్యత్తులో మరిన్ని ఫీచర్లు కూడా యాడ్ అవుతాయి.
బ్లూస్కైకి ట్విట్టర్ లాంటి ఇంటర్‌ఫేస్, ప్రొఫైల్ ఫీడ్‌లు, నోటిఫికేషన్‌ల ట్యాబ్ లాంటివి మరిన్ని ఉన్నాయి. బ్లూస్కై ట్విట్టర్r ద్వారా ప్రేరణ పొందింది అలాగే ప్రకటనలు, కంటెంట్ వినియోగదారులకు అవాంతరం లేకుండా ట్విట్టర్ అందించే ప్రతిదాన్ని అందించగలదు.