వాట్సాప్ పేమెంట్స్ లో కొత్త ఫీఛర్: ఇతర యూపీఐ యాప్స్ కు చెల్లింపులు చేసే సదుపాయం
వాట్సాప్ లో ఇతర యూపీఐ యాప్స్ కు, క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు జరిపే సదుపాయాన్ని ఇండియాలో కల్పించబోతున్నట్లు కంపెనీ వెలడి చేసింది. దీనివల్ల ఇండియాలో ఉన్న 500మిలియన్ల వాట్సప్ వినియోగదారులకు మేలు కలగనుంది. ఇంతకుముందు ఇతర యాప్స్ కు పేమెంట్స్ చేయాలంటే ఆ యాప్ లోకి రీడైరెక్ట్ అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ యూపీఐ(Unified Payemnts Interface) సిస్టమ్ ద్వారా వాట్సాప్ తో చెల్లింపులు చేయవచ్చు. ఈ కొత్త చెల్లింపు పద్దతి తీసుకురావడానికి ముఖ్య కారణం, భారతీయ వినియోగదారులను ఆకర్షించడానికే. ఇండియాలో సుమారు 300మిలియన్ల మంది నెలకు 180బిలియన్ల లావాదేవీలను జరుపుతున్నారు. యూపీఐ పేమెంట్స్ చేసే వారందరికీ సేవలను అందించడం వల్ల బిజినెస్ పెరుగుతుందని మెటా భావిస్తోంది.
క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు
కేవలం యూపీఐ చెల్లింపులు మాత్రమే కాదు, డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు జరిపే విధానాన్ని తీసుకొచ్చింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో వాట్సాప్ స్థానాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి, ఇలాంటి సౌకర్యాలను మెటా అందిస్తోంది. మరో విషయం ఏంటంటే, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలకు వెరిఫైడ్ సబ్ స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ని విస్తరించాలని మెటా చూస్తోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆయా బిజినెస్ తాలూకు ప్రామాణికత తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మెటా వెరిఫైడ్ సబ్ స్క్రిప్షన్ ప్రోగ్రామ్ అనేది ఫేస్ బుక్ ఇన్స్టాగ్రామ్ లలో అందుబాటులో ఉంది. ఈ ప్రోగ్రామ్ కింద ఫేస్ బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ ఖాతాకు $21.99గా ఉంది. రెండింటికీ కలిపి $34.99 గా ఉంది.