దేశంలో 37.16 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్లాక్
భారతదేశంలో నవంబర్‌లో 37.16 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లు ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ బుధవారం తెలిపింది. గత నెలలో నిషేధించిన ఖాతాల కంటే 60 శాతం ఎక్కువని సంస్థ తెలిపింది. దీంతో దేశంలో నిషేధించబడిన వాట్సాప్ ఖాతాలు 9.9 లక్షలకు చేరాయి. భారత ప్రభుత్వం గత ఏడాది నూతన ఐటీ నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కచ్చితంగా అమలు చేయాల్సిన కొన్ని నిబంధనల గురించి స్పష్టంగా పేర్కొంది. అవాంఛనీయ ఖాతాల తొలగింపునకు, యూజర్ల ఫిర్యాదలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతీ మూడు నెలలకు ఒకసారి వెల్లడించాలనే నిబంధన కూడా ఉంది. అందులో భాగంగానే.. వాట్సాప్ బ్యాన్ చేసిన ఖాతాల లెక్కలను వెల్లడించింది.
యూజర్ల నుంచి అధిక సంఖ్యలో విజ్జ్ఞప్తులు
విద్వేషాన్ని ప్రేరేపించే, అసాంఘీక కార్యకలాపాలకు వాడే, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అకౌంట్లను వాట్సాప్ ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటుంది. అక్టోబర్ నెలలో యూజర్లు ఫిర్యాదు చేయడానికి ముందు.. బ్యాన్ చేసిన ఖాతాల సంఖ్య 8.11 లక్షలని వాట్సాప్ ప్రకటించింది. 10 అంకెల మొబైల్ నెంబర్‌కు ముందు వచ్చే +91 కోడ్‌ను బట్టి దాన్ని భారతీయ ఖాతగా గుర్తిస్తామని వాట్సాప్ తెలిపింది. అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో ఖాతాలను నిషేధించాలని వాట్సాప్‌కు యూజర్ల నుంచి అధిక సంఖ్యలో విజ్జ్ఞప్తులు వచ్చినట్లు పేర్కొంది.