Whatsapp accounts: 85 లక్షల భారతీయుల ఖాతాలపై నిషేధం విధించిన వాట్సప్
మెటా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారతీయ వినియోగదారుల ఖాతాలపై అతిపెద్ద నిషేధాన్ని అమలు చేసింది. 2021 ఐటీ నిబంధనలు ఉల్లంఘన చేయడం, వాట్సప్ దుర్వినియోగానికి పాల్పడటం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకుంది. సెప్టెంబర్ నెలలోనే 85 లక్షలకు పైగా ఖాతాలను బ్యాన్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో 16,58,000 ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా, ఐటీ నిబంధనలు ఉల్లంఘించినందువల్ల వాట్సప్ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చర్యలు
భారతదేశంలో 600 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న ఈ ప్లాట్‌ఫామ్ తన నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. బల్క్ లేదా స్పామ్ మెసేజ్‌లు పంపడం, తప్పుడు సమాచారం పంపే యూజర్లు, లేదా స్థానిక చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటుంది. గత ఆగస్టు నెలలో కూడా వాట్సప్ 84.58 లక్షల ఖాతాలపై నిషేధం విధించింది, ఇందులో 16,61,000 ఖాతాలకు వినియోగదారుల ఫిర్యాదులు లేకుండానే నిబంధనల ఉల్లంఘన కారణంగా తొలగించినట్లు వెల్లడించింది.