Loading...
WhatsApp Chat Backup: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక గూగుల్‌ డ్రైవ్‌ లేకుండానే చాట్‌ బ్యాకప్
వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక గూగుల్‌ డ్రైవ్‌ లేకుండానే చాట్‌ బ్యాకప్

WhatsApp Chat Backup: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక గూగుల్‌ డ్రైవ్‌ లేకుండానే చాట్‌ బ్యాకప్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 18, 2026
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్‌ యూజర్లకు ఉపయోగపడే కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తోంది. ఇకపై చాట్‌ హిస్టరీ, ఇతర వాట్సాప్‌ డేటాను గూగుల్‌ డ్రైవ్‌ వంటి బయటి క్లౌడ్‌ సేవలపై ఆధారపడకుండా వాట్సాప్‌ సర్వర్లలోనే బ్యాకప్‌ చేసుకునే అవకాశం లభించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ WhatsApp Beta for Android 2.26.46.4 వెర్షన్‌లో కనిపిస్తోంది. గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా అందుబాటులో ఉన్న ఈ బీటా అప్‌డేట్‌తో చాట్‌ బ్యాకప్‌ విధానంలో వాట్సాప్‌ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది.

Details

ఉచితంగా 2GB క్లౌడ్‌ స్టోరేజ్

కొత్త బ్యాకప్‌ సదుపాయంలో సాధారణ యూజర్లకు 2GB ఉచిత క్లౌడ్‌ స్టోరేజ్‌ లభిస్తుంది.

అంతేకాదు, వాట్సాప్‌ సర్వర్లలో నిల్వ చేసే బ్యాకప్‌లకు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను తప్పనిసరి చేసింది.

అంటే బ్యాకప్‌ డేటా డిఫాల్ట్‌గా ఎన్‌క్రిప్ట్‌ అవుతుంది. దీంతో వాట్సాప్‌ లేదా మెటా సహా ఇతరులు ఆ బ్యాకప్‌లోని సమాచారాన్ని నేరుగా యాక్సెస్‌ చేయలేరు.

చాట్స్‌ను క్లౌడ్‌లో ఉంచుకోవాలనుకునే వారికి ఈ సెక్యూరిటీ విధానం అదనపు రక్షణగా నిలుస్తుంది.

Details

WhatsApp Plus యూజర్లకు 100GB

ప్రీమియం సేవ అయిన WhatsApp Plus సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఏకంగా 100GB బ్యాకప్‌ స్టోరేజ్‌ అందుబాటులో ఉంటుంది.

ప్లాన్‌ తీసుకున్న వెంటనే ఈ స్టోరేజ్‌ పరిమితి ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్‌ అవుతుంది. ఇంకా ఎక్కువ స్థలం అవసరమైన వారికి Meta One ద్వారా అదనపు ప్లాన్‌లు కూడా ఉన్నాయి.

వీటిలో గరిష్ఠంగా 4TB వరకు స్టోరేజ్‌ పొందే అవకాశముంది. ఎక్కువగా ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లతో చాట్స్‌ చేసే వారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

ADVERTISEMENT

Details

అందరికీ ఎప్పుడు వస్తుందంటే..

ప్రస్తుతం ఈ ఫీచర్‌ దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. అందుకే అన్ని బీటా యూజర్లకు ఒకేసారి కొత్త బ్యాకప్‌ ఆప్షన్‌ కనిపించకపోవచ్చు.

మీ వాట్సాప్‌లో ఇప్పటికీ ఈ సదుపాయం కనిపించకపోయినా ఆందోళన అవసరం లేదు. రాబోయే వారాల్లో మరిన్ని అకౌంట్లకు ఫీచర్‌ చేరే అవకాశం ఉంది.

అయితే పూర్తి స్థాయిలో అందరికీ ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందనే విషయంపై వాట్సాప్‌ ఇప్పటివరకు స్పష్టమైన తేదీని ప్రకటించలేదు.

ADVERTISEMENT