Page Loader
WhatsApp: వాట్సాప్‌లో ఆసక్తికరమైన ఫీచర్.. ఒకే ఐఫోన్‌లో మల్టీపుల్ అకౌంట్లను యాక్సస్ చేయొచ్చు..!
వాట్సాప్‌లో ఆసక్తికరమైన ఫీచర్.. ఒకే ఐఫోన్‌లో మల్టీపుల్ అకౌంట్లను యాక్సస్ చేయొచ్చు..!

WhatsApp: వాట్సాప్‌లో ఆసక్తికరమైన ఫీచర్.. ఒకే ఐఫోన్‌లో మల్టీపుల్ అకౌంట్లను యాక్సస్ చేయొచ్చు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులను అక్కటుకునేందుకు కొత్త ఫీచర్లను తీసుకురావడంలో ముందుంటుంది. తాజాగా, యూజర్లకు మరింత సౌలభ్యం కలిగించేందుకు మల్టీ అకౌంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఐఓఎస్ యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఐఓఎస్ యాప్ కోసం ఒక కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఒకే ఫోన్‌లో వేర్వేరు అకౌంట్లను నిర్వహించే అవకాశం ఉంటుంది. మల్టీ అకౌంట్ ఫీచర్‌తో, వినియోగదారులు వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు విడివిడిగా అకౌంట్లను సులభంగా నిర్వహించవచ్చు.

వివరాలు 

యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ 

ఈ ఫీచర్ ద్వారా సాధారణ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించి, వేర్వేరు వాట్సాప్ అకౌంట్ల మధ్య చక్కగా మారవచ్చు. వాట్సాప్ బీటా ట్రాకర్ ప్రకారం, మల్టీ అకౌంట్ ఫీచర్ ఐఓఎస్ బీటా యాప్ వెర్షన్ 25.2.10.70లో గుర్తించబడింది. ఫీచర్ ప్రత్యేకతలు ఒకే ఐఫోన్‌లో పర్సనల్ లేదా బిజినెస్ అకౌంట్లను యాడ్ చేసుకునే వెసులుబాటు. యాప్ సెట్టింగ్‌లలో నేరుగా మల్టీ అకౌంట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. రెండు అకౌంట్ల మధ్య మారడానికి యాప్ రీస్టార్ట్ అవసరం ఉంటుంది.

వివరాలు 

ఆండ్రాయిడ్ వెర్షన్‌లో ఇదే ఫీచర్ 

ఇది కేవలం ఐఓఎస్ యూజర్లకే కాకుండా, ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురావడంపై వాట్సాప్ పని చేస్తోంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.17.8లో ఈ ఫీచర్ మొదటిగా గుర్తించబడింది. సదుపాయాలు మల్టీ అకౌంట్‌లకు ప్రత్యేక నోటిఫికేషన్లు, చాట్‌ల నిర్వహణ, బ్యాకప్‌లు, సెట్టింగ్‌లను అందించే అవకాశం ఉంటుంది. డ్యూయల్ సిమ్ వినియోగదారులకు ఒకే డివైజ్‌లో రెండు అకౌంట్‌లను సౌకర్యవంతంగా యాక్సెస్ చేయవచ్చు. అదనపు యాప్‌ల అవసరం లేకుండా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పనిచేయగల ఫీచర్. ఈ మల్టీ అకౌంట్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఫీచర్ పబ్లిక్ రీలీజ్‌కు సిద్ధమవుతుందని, అది వాట్సాప్ వినియోగాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నారు.