Page Loader
Whatsapp: వాట్సాప్ లో సూపర్ ఫీచర్.. వీడియో కాల్‌ల కోసం కొత్త లో లైట్ మోడ్‌..ఈ ఫీచర్'ని ఎలా యాక్టివేట్ చెయ్యాలంటే! 
ఈ ఫీచర్'ని ఎలా యాక్టివేట్ చెయ్యాలంటే!

Whatsapp: వాట్సాప్ లో సూపర్ ఫీచర్.. వీడియో కాల్‌ల కోసం కొత్త లో లైట్ మోడ్‌..ఈ ఫీచర్'ని ఎలా యాక్టివేట్ చెయ్యాలంటే! 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2024
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ (Whatsapp) తమ వినియోగదారుల కోసం మరో సూపర్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తక్కువ కాంతిలో (Light Mode) మసక వెలుతురులోనూ మెరుగైన క్వాలిటీతో వీడియో కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ అప్‌డేట్‌ ద్వారా తక్కువ వెలుతురు ఉన్న గదిలోనూ వీడియో కాల్స్‌ను సులభంగా చేసుకుని ఇష్టమైన వారితో మాట్లాడుకోవచ్చు. వినియోగదారులు తక్కువ లైటింగ్ సమయంలోనూ మెరుగైన వీడియో కాల్స్ చేయాలనే లక్ష్యంతో ఈ ఫీచర్‌ను రూపొందించారు. వీడియో కాలింగ్ సమయంలో కొత్త ఫిల్టర్లు, బ్యాక్‌గ్రౌండ్ ఫీచర్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.

వివరాలు 

లైట్ మోడ్ అంటే?

ఈ ఫీచర్ పేరు ప్రకారం, గదిలో కాంతి తక్కువగా ఉన్నా మీరు ఇష్టమైన వారికి వీడియో కాల్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాట్సాప్‌లో వీడియో కాల్ నాణ్యతను మెరుగుపరచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. మీరు వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ పరిసరాల్లోని కాంతిని పరిశీలించి, అందుకు అనుగుణంగా వీడియో కాల్‌కు అనువుగా లైట్‌ను అడ్జస్ట్ చేస్తుంది. ఇది మీ ముఖానికి ఎక్కువ వెలుతురు వచ్చేలా చేస్తుంది. చీకటిలో వీడియో స్పష్టతను డిస్ట్రబ్ చేసే గ్రైనినెస్‌ను తగ్గిస్తుంది. ఎలాంటి లైటింగ్‌లోనైనా మీ స్నేహితులు మిమ్మల్ని స్పష్టంగా చూడగలుగుతారు. మీ ఫోన్ వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి..

వివరాలు 

ఎలా యాక్టివేట్ చేయాలంటే?

ముందుగా వాట్సాప్‌ను ఓపెన్ చేసి వీడియో కాల్ చేయండి. మీ వీడియోను ఫుల్ స్క్రీన్ చేయండి. లైట్ మోడ్ యాక్టివేట్ చేయడానికి, కుడి పక్కన పైన ఉన్న 'టార్చ్' గుర్తును నొక్కండి. తర్వాత లైట్‌ను అడ్జస్ట్ చేయడానికి బల్బు గుర్తుపై నొక్కండి. ఇలా చేస్తూ,మీకు సరిపడే కాంతి వచ్చేవరకు దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇక, వాట్సాప్‌లో లైట్ మోడ్ iOS, Android వెర్షన్లలో అందుబాటులో ఉంది. అయితే, Windows Whatsapp యాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు.కానీ వినియోగదారులు తమ వీడియో కాల్స్ కోసం బ్రైట్‌నెస్ స్థాయిలను సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రతి కాల్‌కు తక్కువ లైట్ మోడ్‌ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి దీన్ని శాశ్వతంగా ఎనేబుల్ చేసే ఆప్షన్ లేదు.