వాట్సాప్ లో ఛాట్ లాక్ ఫీఛర్: ఇకపై ఛాట్ లకు లాక్ వేసుకోవచ్చు
వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త వచ్చేసింది. ఛాట్ లాక్ పేరుతో సరికొత్త ఫీఛర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం మీరు మీ పర్సనల్ ఛాట్ లకు లాక్ వేసుకోవచ్చు. అంటే, సాధారణంగా వాట్సాప్ కు ఎలా లాక్ వేస్తామో, అలాగే కేవలం ఛాట్ కు కూడా లాక్ వేయవచ్చు. లాక్ చేసిన ఛాట్స్ అన్నీ ప్రత్యేక ఫోల్డర్ లో ఉంటాయి. ఆ ఫోల్డర్ కు పాస్ వర్డ్ రక్షణ ఉంటుంది. అలాగే ఫింగర్ ప్రింట్ భద్రత కూడా ఉంటుంది. కాబట్టి మీ ఛాట్స్ ని ఎవ్వరూ చూడలేరు. వాట్సాప్ నోటిఫికేషన్ల ద్వారా వచ్చే ప్రివ్యూ కూడా కనబడదు. నోటిఫికేషన్ వస్తే లాక్డ్ అకౌంట్ అని మాత్రమే చూపిస్తుంది.
ఛాట్ లాక్ ఫీఛర్ పై వీడియో
ఈ ఫీఛర్ గురించి మరింత సమాచారాన్ని సులభంగా తెలియజేయడానికి ఒక వీడియోను రిలీజ్ చేసింది మెటా గ్రూప్. ఫోన్ ఎవ్వరి దగ్గరున్నా మీ వాట్సాప్ ఛాట్ మాత్రం భద్రంగా ఉంటుందన్న కాన్సెప్ట్ తో ఈ వీడియోను తయారు చేసారు. ఛాట్ లాక్ ఫీఛర్ పై వాట్సాప్ యూజర్లు సంతోషంగా ఉన్నారు. ప్రైవసీకి మరింత రక్షణ దొరుకుతుందని అంటున్నారు. ముందు ముందు మరిన్ని ఫీఛర్లను అందించి, యూజర్లకు వాట్సాప్ వినియోగాన్ని మరింత ఉపయోగకరంగా మార్చుతామని మెటా వెల్లడి చేసింది.